ధాన్యం... దైన్యం

ABN , First Publish Date - 2020-11-30T05:13:59+05:30 IST

నివర్‌ తుపాను కారణంగా జిల్లాలో భారీగా వరి పంట దెబ్బ తింది. ఈ సమయంలో కొంతమంది దళారు లు రైతు లను మరింత ఆందోళనకు గురిచేస్తు న్నారు.

ధాన్యం... దైన్యం
పొలం వద్ద ధాన్యాన్ని పట్ట కప్పి ఉంచిన రైతులు

ధాన్యం రైతులకు దళారుల బెడద

తడిచిన ధాన్యానికి ధర రాదని మాయమాటలు

తాము ప్రభుత్వం కంటే ఎక్కువ ధర చెల్లిస్తామంటూ వల


ఆరు గాలం కష్టపడి ధాన్యం పండించిన వరి రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. ప్రకృతి విపత్తులు ఓ వైపు.. ప్రభుత్వ నిర్లక్ష్యం మరో వైపు వారిని నట్టేట ముంచుతోంది. చేతి కొచ్చిన పంట చేజారిపోగా రైతులకు ఇక కన్నీరే మిగిలింది. చివరి ప్రయత్నంగా ఒక్క గింజైనా మిగలకపోతుందా అనే ఆశతో పంట చేలలో ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.   ఈ సమయంలో వారిని దళారులు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నారు.  వివిధ కారణాలు చూపి కారుచౌకగా ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేసి దానిని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి ఇచ్చి సొమ్ము చేసుకొనేందుకు యత్నిస్తున్నారు. 


గుంటూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నివర్‌ తుపాను కారణంగా జిల్లాలో భారీగా వరి పంట దెబ్బ తింది. ఈ సమయంలో కొంతమంది దళారు లు రైతు లను మరింత ఆందోళనకు గురిచేస్తు న్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని చాలా తక్కువ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాయ మాటలు చెబుతున్నారు. కారుచౌకగా ధాన్యా న్ని రైతుల వద్ద కొనుగోలు చేసి దానిని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి ఇచ్చి సొమ్ము చేసుకొనే ప్రయత్నిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి డెల్టా ప్రాంతంలో పలు గ్రామాల కు దళారులు వెళ్లి రైతులకు వల విసురుతున్నట్లు సమాచారం. కొంత మంది అడ్వాన్స్‌లు కూడా చెల్లి స్తామంటూ మభ్య పెడు తున్నారు.


2.66 లక్షల ఎకరాల్లో తడిసిన వరి 

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 5 లక్షల ఏడు వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో భారీ వర్షాలు, కృష్ణానదికి వరదలు వచ్చాయి. కాగా పంట చేతికి వచ్చే సమయంలో నివర్‌ తుపాను రావడంతో దాదాపుగా 2.66 లక్షల ఎకరాల్లో వరి పంట వర్షం నీటిలో తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులకు పైగా పంట వర్షం నీటిలో నాని ఉండటం వలన ధాన్యం రంగు మారడం, మొలకలు ఎత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు బృందాలుగా ఏర్పడి పంటల్లో నిలిచి ఉన్న నీటిని రెండు రోజులుగా కాలువలు, వాగుల్లోకి తోడిస్తున్నారు. అయినప్పటికీ రైతులు ఆందోళనగా ఉన్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 164 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని రైతుభరోసా కేంద్రాలతో అనుసంధానం చేసింది. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని తప్పక కొనుగోలు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌(రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యత ప్ర మాణాల మేరకు గ్రేడ్‌ ఏ రకం క్వింటాల్‌కు రూ.1,888, సాధారణ రకం రూ.1,868 చెల్లిస్తామని స్పష్టం చేశారు.


దళారులను నమ్మి మోసపోవద్దు..

అయితే దళారులు మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రా లకు వెళితే అనేక నాణ్యత పరీక్షలు చేస్తారని, అవన్నీ అయిన తర్వాత చాలా తక్కువగా ధర కడతారని చెబు తున్నారు. అదే తమకు ఇస్తే వెంటనే డబ్బులు చెల్లిస్తా మంటున్నారు. అసలే ధాన్యం తడిసి ఏమౌతుందోనని ఆందోళనలో ఉన్న రైతులు దళారుల మాటలతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఈ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ దీనిపై ఓ ప్రకటన జారీ చేశారు. రైతులు ఎవ్వరూ దళారుల బారినపడి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని తాము కొనుగోలు చేస్తామన్నారు. రైతుల తమ వద్ద ఉన్న ధాన్యం వివరాలను సమీపంలోని కొనుగోలు కేంద్రంలో నమోదు చేయించుకొని నిర్దేశించిన మద్దతు ధర పొందాలన్నారు. 




Updated Date - 2020-11-30T05:13:59+05:30 IST