నేర సమాచారం

ABN , First Publish Date - 2020-11-22T06:20:52+05:30 IST

పావగ పట్టణ సమీపంలోని తి మ్మాపురం వద్ద నీటి ట్యాంకర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో కేశవనాయక్‌(50) మృతి చెందిన ఘటన శని వారం సాయంత్రం చోటు చేసుకొంది.

నేర సమాచారం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పావగడ, నవంబరు 21: పట్టణ సమీపంలోని తి మ్మాపురం వద్ద నీటి ట్యాంకర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో కేశవనాయక్‌(50) మృతి చెందిన ఘటన శని వారం సాయంత్రం చోటు చేసుకొంది. ఉప్పారపల్లి తండా గ్రామానికి చెందిన కేశవనాయక్‌ పావగడకు పనినిమిత్తం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ఈప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


మిద్దెపై నుంచి పడి కర్ణాటక వాసి మృతి 

   తనకల్లు, నవంబరు 21 : మండల పరిధిలోని మరాలపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మిద్దె పై నుండి కింద పడి కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన యోగేంద్రకుమార్‌ (57) మృతి చెందిన సంఘనట చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. యోగేంద్రకుమార్‌ అత్త మృతి చెందగా సంవత్సరికం నిర్వహించడానికి మరాలపల్లి గ్రామానికి వచ్చాడు. కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత రాత్రి మిద్దె పై నిద్రిస్తూ ప్రమాదవ శాత్తూ మిద్దె పై నుంచి కిందపడి చనిపోయాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


========================================================


రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మృతి

పావగడ వెళ్లొస్తూ.. తిరిగిరాని లోకాలకు..

ఆత్మకూరు, నవంబరు 21 : మండల పరిధిలోని పీ కొత్తపల్లి సమీపాన శనివారం రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మరణించారు. ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురానికి చెందిన బూసి నరేంద్ర(25), నార్పల మండలం గూ గూడు గ్రామ వాసి ఆసాది చందు(18) కళ్యాణదుర్గం వైపు నుంచి అనంతపురం వైపు ద్విచక్రవాహనంలో వస్తున్నారు. వారిని పావగడ ప్రాంతానికి చెందిన లగేజీ ఆటో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నరేంద్రకు భార్య సావిత్రి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి మేనల్లుడు చందు. గూగూడుకు చెందిన పరుశురామ్‌, నల్లమ్మ దంపతులకున్న ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు. అనంతపురంలోని జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చేరాడు. తన మేనమామ ఇంటి దగ్గర ఉండాలని వచ్చాడు. వారిద్దరూ పావగడలోని శనీశ్వర స్వామిని దర్శించుకుని, స్వగ్రామానికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని ఎస్‌ఐ శంకర్‌రెడ్డి పరిశీలించి, మృతదేహాలను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లగేజీ ఆటోను పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. బాదితకుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


========================================================



అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి 

రాయదుర్గం టౌన్‌, నవంబరు 21 : పట్టణంలోని మా రుతీ క్లీని క్‌ ఎదుట శనివారం గుమ్మఘట్ట మండలం శిరిగేదొడ్డి గ్రామానికి చెందిన చాకలి శేఖన్న (59) అ నుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సీఐ ఈరణ్ణ తెలిపిన వివరాలివి. శేఖన్న ఉదయం పని నిమిత్తం పట్టణానికి వచ్చి క్లీనిక్‌ ఎదుట నిద్రపోయాడు. షాపు యజమాని నిద్రలేపగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2020-11-22T06:20:52+05:30 IST