‘థర్మల్‌’ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరులో రేపు బహిరంగ సభ

ABN , First Publish Date - 2022-05-24T04:24:04+05:30 IST

జెన్‌కో థర్మల్‌ కేంద్రం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరులో ని టౌన్‌ హాల్‌లో బుధవారం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని జెన్‌కో థర్మల్‌కేంద్రం పరిరక్షణ కమిటీ చైౖర్మన్‌ మోహన్‌రావు పేర్కొన్నారు.

‘థర్మల్‌’ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ   నెల్లూరులో రేపు బహిరంగ సభ
ప్రచార జాతా నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

ముత్తుకూరు, మే 23 : జెన్‌కో థర్మల్‌ కేంద్రం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరులో ని టౌన్‌ హాల్‌లో బుధవారం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని జెన్‌కో థర్మల్‌కేంద్రం పరిరక్షణ కమిటీ చైౖర్మన్‌ మోహన్‌రావు పేర్కొన్నారు. సోమవారం బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ముత్తుకూరులో ప్రచార జాతా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్తాడుతూ నాలుగు నెలలుగా జెన్‌కో ఉద్యోగులు, కార్మికులు శాంతియుతంగా థర్మల్‌ కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని కాలరాస్తూ, థర్మల్‌ కేంద్రాన్ని ప్రైవేటు రంగానికి అప్పగించాలని నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. జెన్‌కో కార్మికుల అందోళనకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. బహిరంగసభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గడ్డం అంకయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T04:24:04+05:30 IST