ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి

ABN , First Publish Date - 2022-06-28T06:00:49+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌ విమర్శించారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి
బీసెంట్‌ రోడ్డు వార్డు సచివాలయం వద్ద సీపీఎం నేతల ధర్నా

 ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి

సీపీఎం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ధర్నా

గవర్నర్‌పేట, జూన్‌ 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరుతూ సీపీఎం 23వ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో బీసెంట్‌ రోడ్డులోని వార్డు సచివాలయం వద్ద సోమవారం ధర్నా జరిగింది. రాష్ట్రంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన ప్రభుత్వం డబ్బులు కట్టాలని పేద ప్రజలపై ఒత్తిడి చేయడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయి ఖాళీగా ఉన్న ఇళ్లు నగర ప్రజలకు ఇవ్వకుండా నగరానికి 30 నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు కేటాయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని, దాని ఫలితంగానే రాష్ట్ర ప్రజలపై అనేక భారాలు పడుతు న్నాయన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రజలెదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజల్ని ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరిం చారు. సీపీఎం సెంట్రల్‌ సిటీ కమిటీ సభ్యుడు వై. సుబ్బారావు, డివిజన్‌ పార్టీ నాయకులు బి. లక్ష్మణ్‌, కె. వెంకటేశ్వరరెడ్డి, సీహెచ్‌ మురళీ, బి. వెంకటేశ్వరరావు, వై. కృష్ణ, సన్యాసిరావు, సూరమ్మ, గఫూర్‌, హేమంత్‌ పాల్గొన్నారు. అనంతరం కాశీనాథ్‌ నేతృత్వంలో ప్రతినిధి బృందం వార్డు సచివాలయం అడ్మిన్‌కు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2022-06-28T06:00:49+05:30 IST