అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-05-19T05:23:05+05:30 IST

అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి
సీపీఐ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్‌కుమార్‌ తదితరులు

ముప్పాళ్ళ నాగేశ్వరరావు

గుంటూరు(తూర్పు), మే18: అగ్రిగోల్డ్‌ బాధితులను  ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బు చెల్లించేలా జీవో విడుదల చేయాలంటూ మంగళవారం కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలసి ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముప్పాళ్ళ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రూ.1,150 కోట్లు, ఆరు మాసాల్లో పూర్తి చెల్లింపులు చేస్తామన్న హామీ నిలబెట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరగకపోతే మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.  కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్‌, సీపీఐ నాయకులు జంగాల అజయ్‌కుమార్‌, కోటా మాల్యాద్రి. అసోసియేషన్‌ నాయకులు సాంబశివరావు, రామయ్య, ప్రసాదు, సాంబశివరావు, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

      

Updated Date - 2021-05-19T05:23:05+05:30 IST