Abn logo
Oct 27 2021 @ 07:50AM

సీఎం Jaganకు రామకృష్ణ లేఖ

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రేషన్ డీలర్లు కమిషన్ ద్వారా వచ్చే మొత్తంలో నుండి షాప్ అద్దె, విద్యుత్ ఛార్జీలు, దిగుమతి చార్జీలు భరించాల్సి వస్తోందని తెలిపారు. రేషన్ డోర్ డెలివరీ వలన డీలర్లకు ఆదాయం తగ్గి, పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్డుదారులు రేషన్ షాపులకు రాకపోవడంతో నాన్ పిడిఎస్ సరుకులు అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఖాళీ గోనే సంచులు మీద వచ్చే ఆదాయం రేషన్ డీలర్స్‌కి చెందే విధంగా పాత పద్ధతి పునరుద్ధరించాలని కోరారు. గత ఏడాది ఉచితంగా పంపిణీ చేసిన శెనగలు, కందిపప్పులకు సంబంధించిన కమిషన్ను డీలర్లకు తక్షణమే జమ చేయాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption