అమరావతి: తిరుపతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణతో పాటు పలువురు సీపీఐ నేతల అరెస్టులను ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ నేత అమిత్ షా పర్యటన సందర్భంగా శాంతియుత నిరసన తెలిపేందుకు కూడా హక్కు లేదా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి అడుగడుగునా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదాపై చేసిన మోసాన్ని మర్చిపోయి తిరుపతిలో పర్యటించడానికి బీజేపీ నేతలకు సిగ్గుండాలని వ్యాఖ్యలు చేశారు. తక్షణమే అరెస్టు చేసిన సీపీఐ నేతలను విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.