అమరావతి: అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రను ఆదరించాలని రాష్ట్ర ప్రజలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అమరావతి రైతులు, మహిళల రెండేళ్ల చారిత్రక ఉద్యమానికి మహా పాదయాత్ర మరో మైలురాయన్నారు. 45 రోజుల పాటు జరిగే మహా పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలకాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.