అనంతపురం: వరదల్లో 60 మంది చనిపోయారని... తిరుపతిలో చెరువుల ఆక్రమణ వల్లే ఆస్తి నష్టం కలిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గాడిదలు కాస్తుందా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో డ్యామ్ల గేట్లు పనిచేయవని విమర్శించారు. మానవ తప్పిదం వల్లే వరదల్లో ప్రాణ నష్టం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని... పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.