Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీ అంత చేతకాని దద్దమ్మ ఇంకొకరు ఉండరు...సోమువీర్రాజుపై రామకృష్ణ ఆగ్రహం

అనంతపురం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం కాదు...ప్రత్యేక హోదా ఇచ్చారా..? విభజన హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర పరిస్థితుల గురించి ఏనాడైనా కేంద్రమంత్రులతో గాని ప్రధానితో గాని మాట్లాడారా అని నిలదీశారు. ‘‘మీ అంత చేతకాని దద్దమ్మ ఇంకొకరు ఉండరు.. కమ్యూనిస్టు పార్టీలకు డబ్బులు మీ నాయనా ఇచ్చారా..? లేక మీ తాత ఇచ్చారా…?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తలతిక్క మాటలు మాట్లాడితే తోలు తీస్తామని హెచ్చరించారు. మాజీ సీఎం చంద్రబాబు ఉద్యోగులకు రెండు డీఏలు పెండింగ్ పెడితే  విమర్శించిన జగన్మోహన్ రెడ్డి...  ఇప్పుడు ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టారని అన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన  చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతల మధ్య  జగన్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతి విషయంలో సీఎం జగన్ లేనిపోని డాంబికాలకు పోయి చాలా తప్పు చేశారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement