సంఘవిద్రోహ శక్తులకు సహకరించవద్దు : సీపీ

ABN , First Publish Date - 2020-12-06T04:22:57+05:30 IST

ప్రజలు సంఘవిద్రోహక శక్తు లకు సహకారించవద్దని రామగుండం సీపీ సత్యనారా యణ కోరారు.

సంఘవిద్రోహ శక్తులకు సహకరించవద్దు : సీపీ
మాట్లాడుతున్న సీపీ సత్యనారాయణ

నెన్నెల, డిసెంబరు 5: ప్రజలు సంఘవిద్రోహక శక్తు లకు సహకారించవద్దని రామగుండం సీపీ సత్యనారా యణ కోరారు. నెన్నెల మండలం కర్జీ గ్రామంలో శని వారం పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలో  ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత సం బంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని  కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. మావోయిస్టులు మాయ మాటలు చెప్పి సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు పోతారని, అనంతరం స్థానికులు కేసులతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. కర్జీ ప్రాంతం గతం లో మావోయిస్టులకు షెల్టర్‌గా ఉండేదన్నారు. ప్రజల సహకారంతో పోలిసుల కృషి ఫలితంగా ఎలాంటి సమ స్యలు లేకుండా పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయన్నారు.  శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా ప్రజల కష్టసుఖాల్లో పోలీసులు పాలు పంచుకుంటారన్నారు.  పోలీసులు మీకోసంలో భాగంగా గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రాణహి త పరివాహక  ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ ప్రజలు తమ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాలన్నారు. వైద్య శిబి రాన్ని నిర్వహించిన బెల్లంపల్లి ఏసీపీ, రూరల్‌ సీఐ,  ఎస్సై రమాకాంత్‌ను సీపీ అభినందించారు. ఈ సంద ర్భంగా 200 మంది నిరుపేదలకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. పది గ్రామాలకు చెందిన యువతకు స్పోర్ట్స్‌ కిట్లు అందజేశారు. డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, ఓఎస్‌ డీ శరత్‌చంద్రపవార్‌, ట్రైనీ ఐపీఎస్‌ అధికారి అశోక్‌కు మార్‌, ఏసీపీ రహెమాన్‌, రూరల్‌ సీఐ జగదీష్‌,  ఏఎం సీ చైర్‌పర్సన్‌ గడ్డం కళ్యాణి, ఎంపీటీసీ శిరీష, సర్పంచ్‌ రావుల సత్యనారాయణ పాల్గొన్నారు.

కర్జీలో  నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వారికి ఉచితంగా మందు లు అందజేశారు. ఉన్నత వైద్యం అవసరమైన వారిని గుర్తించి పెద్దాసుత్రులకు తీసుకెళ్ళి వైద్యం అందజేస్తా మని అధికారులు తెలిపారు. కంటి ఆపరేషన్లు అవసర మైన వారిని గుర్తించి శస్త్ర చికిత్సలు చేయిస్తామన్నారు.  వైద్య నిఫుణులు డాక్టర్‌ చుంచు రాధికాకిరణ్‌, డాక్టర్‌ హనుమంతప్ప, డాక్టర్‌ దాసరి యశ్వంత్‌ చంద్ర,  డాక్టర్‌ లేగల శ్రీధర్‌బాబు, చుంచు రాజ్‌కిరణ్‌ పరీక్షలు నిర్వహించారు.  


స్పెషల్‌పార్టీ సిబ్బందికి శిక్షణ

బెల్లంపల్లి : పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. బెల్లంపల్లి పోలీస్‌ హెడ్‌  క్వార్టర్స్‌లో ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లాల స్పెషల్‌ పార్టీ సిబ్బందికి, గ్రేహాండ్స్‌ తర హా శిక్షణను ప్రారంభించి మాట్లాడారు.  స్పెషల్‌ పార్టీ పోలీసులకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ఇంటెలిజెన్స్‌ పోలీసు సిబ్బంది అడవు ల్లో సంచరిస్తూ మావోయిస్టుల కదలికలపై ఎప్పటిక ప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శిక్షణ తరగతు ల్లో భాగంగా స్పెషల్‌ పార్టీ పోలీసులతో కలిసి సీపీ  పలు మెలకువలను చూపించారు. అడిషనల్‌ డీసీపీ ఏఆర్‌ సంజీవ్‌, ఏసీపీ రహెమాన్‌, ఏఆర్‌ నాగయ్య, ట్రైనింగ్‌ ఐపీఎస్‌ అశోక్‌కుమార్‌, ఆర్‌ఐలు అనిల్‌, అంజ న్న, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సంఘం అధ్యక్షుడు బోర్లకుం ట పోశలింగం, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:22:57+05:30 IST