రూ.225కే కొవిషీల్డ్ బూస్టర్ : అదర్ పూనావాలా

ABN , First Publish Date - 2022-04-09T21:49:48+05:30 IST

పద్దెనిమిదేళ్లు పైబడిన వారు ఈనెల 10వ తేదీ నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిషీల్డ్ బూస్టర్ తీసుకునేందుకు..

రూ.225కే కొవిషీల్డ్ బూస్టర్ : అదర్ పూనావాలా

న్యూఢిల్లీ: పద్దెనిమిదేళ్లు పైబడిన వారు ఈనెల 10వ తేదీ నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిషీల్డ్ బూస్టర్ తీసుకునేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో కోవిషీల్డ్ డోస్ ధరను రివైజ్ చేసినట్టు సెరుం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) శనివారంనాడు ప్రకటించింది. రూ.600 కొవిషీల్డ్ డోస్ ధరను రూ.225కు తగ్గిస్తున్నట్టు సీఈఓ అదర్ పూనావాలా ఒక ట్వీట్‌లో తెలిపారు.


దీనికి ముందు, 18 ప్లస్ వారికి ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిషీల్డ్ బూస్టర్ డోస్‌కు అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. రెండు డోసులు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు ఈ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని తెలిపింది. కేంద్ర ప్రకటనను సకాలంలో తీసుకున్న నిర్ణయంగా సెరుం ఇన్‌స్టిట్యూట్ పేర్కొనడంతో పాటు, ఒక్కో డోస్ రూ.600 ఉంటుందని ప్రకటించింది. ప్రైవేటు ఆసుపత్రులు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ డిస్కౌంట్ ఇస్తామని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో రూ.600 బూస్టర్ డోస్ ధరను కేవలం రూ.225కే అందించేందుకు నిర్ణయించినట్టు తాజా ట్వీట్‌లో అదర్ పూనావాలా ప్రకటించారు.

Updated Date - 2022-04-09T21:49:48+05:30 IST