రెండు నెలల క్రితం భారత్‌లో ఉన్నది ఒక్క ల్యాబ్ మాత్రమే.. నేడు 612

ABN , First Publish Date - 2020-05-26T23:13:03+05:30 IST

న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం భారత్‌లో పూణే ల్యాబ్ ఒక్కటే ఉండేదని అయితే నేడు 612 ల్యాబ్‌లున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ తెలిపింది.

రెండు నెలల క్రితం భారత్‌లో ఉన్నది ఒక్క ల్యాబ్ మాత్రమే.. నేడు 612

న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం భారత్‌లో పూణే ల్యాబ్ ఒక్కటే ఉండేదని అయితే నేడు 612 ల్యాబ్‌లున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ తెలిపింది. కరోనా టెస్టులు జరిపేందుకు 3 నెలల క్రితం వరకూ పూర్తిగా పూణే ల్యాబ్‌పై ఆధారపడేవాళ్లమని, అయితే నేడు మొత్తం 612 ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని ఐసీఎంఆర్ డైరక్టర్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. వీటిలో 430 ప్రభుత్వానికి సంబంధించినవి కాగా 182 ప్రైవేట్ ల్యాబ్‌లున్నాయన్నారు. టెస్టులకు సంబంధించి భారత్ మూడు నెలల్లో ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు. నేడు రోజుకు లక్షా పది వేల మందిని టెస్ట్ చేయగలిగే పరిస్థితికి రాగలిగామన్నారు.  




దేశంలో ప్రస్తుతం లక్షన్నర మందికి కరోనా సోకింది. 60 వేల మందికి పైగా కోలుకున్నారు. 4,167 మంది ప్రాణాలు కోల్పోయారు.  

Updated Date - 2020-05-26T23:13:03+05:30 IST