త్వరలో పీహెచ్‌సీలలో కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-03-03T05:05:32+05:30 IST

త్వరలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపా రు. మంగళవారం ఆయన కొవిడ్‌ వ్యాక్సిన్‌, ఉపాధి హామీ, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు, రైతు వేదికల నిర్మాణం పై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, డీఎల్పీవోలతో వీ డియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సోమవారం నుంచి రెండు కేటగిరీల వారీ గా మూడు సెంటర్లలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్నామని, త్వర లోనే పీహెచ్‌సీల పరిధిలో ఇస్తామని తెలిపారు.

త్వరలో పీహెచ్‌సీలలో కొవిడ్‌ వ్యాక్సిన్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

కలెక్టర్‌ నారాయణరెడ్డి 

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 2 : త్వరలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపా రు. మంగళవారం ఆయన కొవిడ్‌ వ్యాక్సిన్‌, ఉపాధి హామీ, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు, రైతు వేదికల నిర్మాణం పై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, డీఎల్పీవోలతో వీ డియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సోమవారం నుంచి రెండు కేటగిరీల వారీ గా మూడు సెంటర్లలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్నామని, త్వర లోనే పీహెచ్‌సీల పరిధిలో ఇస్తామని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారు, బీపీ, షుగర్‌ ఉన్న 45 నుంచి 59 ఏళ్లలోపు వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేటు ఆసుప త్రుల్లో (ప్రగతి, మెడికవర్‌) రూ.250లకు వ్యాక్సిన్‌ ఇస్తు న్నామన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు.. సీనియర్‌ సిటిజెన్స్‌, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు టీకా తీసుకునే లా అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకం లో అన్ని గ్రామ పంచాయతీలలో రోజుకు 50 మంది చొ ప్పున పనిచేసే విధంగా చూడాలన్నారు. ఏప్రిల్‌ నుంచి ఇంకా పెంచాలన్నారు. ఉపాధి హామీలో ఈ ఏడాది లక్ష్యం చేరుకోవాలన్నారు. ఇందల్వాయి మండలంలో వంద శా తం కూలీలు పనిచేస్తున్నందున ఎంపీడీవోను అభినందిం చారు. ప్రతీ గ్రామ పంచాయతీలో పనులు జరగాలన్నారు. మేట్లు, పంచాయతీ సెక్రెటరీలు విధులు సక్రమంగా నిర్వ హించాలన్నారు. కల్లాల నిర్మాణం నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. వాటిని కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నవారి ప్రతిపాదనలు పంపాలన్నారు. మంజూరైన వా టిని త్వరగా పూర్తిచేయాలన్నారు. అలాగే పండింగ్‌లో ఉ న్న వైకుంఠధామాల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. వచ్చే హరితహారంనకు నర్సరీలలో మొక్కలు ఉండేలా చూడాలన్నారు. సీడ్‌ జనరేషన్‌ వంద శాతం ఉండాలన్నా రు. ఈనెలాఖరు వరకు లక్ష్యం పూర్తి కావాలన్నారు. గ్రామ పంచాయతీలలో గ్రామ కమిటీ నిర్ణయించిన విత్తనాలు పెట్టాలన్నారు. హరితహారంలో నాటి న మొక్కలకు రోజూ నీళ్లు పోయాలన్నారు. గతనెల 17న నాటిన మొక్కలు ఎ లా ఉన్నాయో త్వరలో తనిఖీ చేస్తానని కలెక్టర్‌ తెలిపారు. కంపోస్టు షెడ్‌ను గ్రామ పంచాయతీలో తప్పకుండా వాడా లన్నారు. చెత్త సేకరించి ప్రాసెస్‌ చేయాలన్నారు. ఎకనామి క్‌ సపోర్టు స్కీమ్‌ కింద రూ.50వేలు సబ్సిడీ కింద పీడ బ్ల్యూడి దరఖాస్తులు రేపటిలోగా ఆన్‌లైన్‌లో పంపాలన్నా రు. ఆస్తిపన్ను వసూలు గ్రామ పంచాయతీల వారీగా ఈ నెల 28 వరకు వందశాతం పూర్తి కావాలన్నారు. వచ్చేవా రం 75 శాతం వసూలు చేయాలన్నారు. ఈ వీడియో కా న్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డీపీ వో జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T05:05:32+05:30 IST