Covis: రేపు మెగా టీకా శిబిరాలు

ABN , First Publish Date - 2022-08-20T15:29:28+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం లక్ష ప్రాంతాల్లో 34వ మెగా టీకా శిబిరాలు(Mega vaccination camps) నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది.

Covis: రేపు మెగా టీకా శిబిరాలు

                           - రాష్ట్ర వ్యాప్తంగా లక్ష, చెన్నైలో 2 వేలు



ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 19: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం లక్ష ప్రాంతాల్లో 34వ మెగా టీకా శిబిరాలు(Mega vaccination camps) నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పటిష్ఠ నివారణ చర్యల వల్ల కొవిడ్‌ నియంత్రణలోకి వచ్చింది. అయినప్పటికీ, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో వచ్చే ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 34వ మెగా టీకా శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ శిబిరంలో మొదటి డోస్‌, రెండవ డోస్‌తో పాటు బూస్టర్‌ డోస్‌ కూడా వేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation) పరిధిలోని 200 వార్డుల్లో 2 వేల శిబిరాలు నిర్వహించనున్నారు.

Updated Date - 2022-08-20T15:29:28+05:30 IST