ప్రతి గురువారం బూస్టర్‌ డోస్‌

ABN , First Publish Date - 2022-01-19T14:17:09+05:30 IST

కరోనా, ఒమైక్రాన్‌ల వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఇకపై ప్రతి గురువారం అరవైయేళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోస్‌ టీకా వేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్‌ డోస్‌ టీకా శిబిరాలను ఏర్పాటు

ప్రతి గురువారం బూస్టర్‌ డోస్‌

                       -  ఆరోగ్య శాఖ Minister సుబ్రమణ్యం 


చెన్నై: కరోనా, ఒమైక్రాన్‌ల వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఇకపై ప్రతి గురువారం అరవైయేళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోస్‌ టీకా వేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్‌ డోస్‌ టీకా శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సైదాపేటలో అరవై యేళ్లుదాటిన వృద్దులకు ‘ఇళ్ల వద్దే బూస్టర్‌ డోస్‌’ పేరిట టీకా వేసే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ అరవైయేళ్లకు పైబడిన వృద్దులందరికీ వీలయినంత త్వరగా బూస్టర్‌ డోస్‌ వేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారని, ఆ మేరకు ప్రతి గురువారం వృద్ధులకు బూస్టర్‌ డోస్‌ టీకాలు వేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 92,522 మందికి బూస్టర్‌ డోస్‌ వేశామని, ఈ టీకాలు వేసుకునేందుకు 4.42 లక్షల మంది అర్హత కలిగి ఉన్నారని, వీరికి గురువారాల్లో నిర్వహించే శిబిరాల్లో టీకాలు వేయనున్నట్టు తెలిపారు. సంక్రాంతి సెలవులకు స్వస్థలాలకు వెళ్ళిన వారంతా తిరుగుముఖం పట్టనుండటంతో వైరస్‌ వ్యాప్తి అధికమయ్యే అవకాశాలున్నాయని, అయితే రెండు రోజుల తర్వాతే వైరస్‌ వ్యాప్తి పెరిగిందో లేదో నిర్థాంచగలమని చెప్పారు. వైద్య విద్య కోర్సుల అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌పై న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండటంతో కౌన్సెలింగ్‌ తేదీని ప్రకటించలేకపోతున్నామని, కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే కౌన్సెలింగ్‌ తేదీని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-19T14:17:09+05:30 IST