కరోనాతో పట్నా ఫ్యామిలీ కోర్టు జడ్జి మృతి

ABN , First Publish Date - 2020-08-07T12:12:45+05:30 IST

కరోనా కాటుకు మొట్టమొదటిసారి ఓ జడ్జి బలయ్యారు. కరోనా బారిన పడిన ఓ జడ్జి చికిత్స పొందుతూ మరణించిన విషాద ఘటన....

కరోనాతో పట్నా ఫ్యామిలీ కోర్టు జడ్జి మృతి

పట్నా (బీహార్): కరోనా కాటుకు మొట్టమొదటిసారి ఓ జడ్జి బలయ్యారు. కరోనా బారిన పడిన ఓ జడ్జి చికిత్స పొందుతూ మరణించిన విషాద ఘటన బీహార్ రాష్ట్రంలోని పట్నా నగరంలో జరిగింది. పట్నా నగరానికి చెందిన హరిశ్చంద్ర శ్రీవాస్తవ ఫ్యామిలీ కోర్టు జడ్జీగా  పనిచేసే వారు. 58 సంవత్సరాల జడ్జి శ్రీవాస్తవకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని పట్నాలోని ఎయిమ్స్ కు తరలించారు. శ్రీవాస్తవ చికిత్స పొందుతూ మరణించారని బీహార్ జుడీషియల్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి అజిత్ కుమార్ సింగ్ చెప్పారు. కరోనాతో జడ్జి శ్రీవాస్తవ మరణించడం బాధాకరమని అజిత్ కుమార్ చెప్పారు. 

Updated Date - 2020-08-07T12:12:45+05:30 IST