కేరళ ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్ ఆంక్షలు

ABN , First Publish Date - 2021-04-21T22:31:00+05:30 IST

కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల

కేరళ ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్ ఆంక్షలు

తిరువనంతపురం : కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై కేరళ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరవ్వాలని తెలిపింది. మిగిలిన 50 శాతం మంది ఉద్యోగులు ఆన్‌లైన్ విధానంలో పని చేయాలని పేర్కొంది. శనివారం సెలవు దినంగా ప్రకటించింది. మరోవైపు, శని, ఆదివారాల్లో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


కోవిడ్-19 కేసుల పెరుగుదలను అడ్డుకునేందుకు తగిన చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నిరోధక మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయడం కోసం మరింత ఎక్కువ మంది పోలీసు సిబ్బందిని, ప్రభుత్వ అధికారులను రంగంలోకి దించాలని నిర్ణయించింది. విద్యను ఆన్‌లైన్ విధానంలోనే అనుమతించాలని, సాధ్యమైనంత వరకు ప్రైవేటు ఉద్యోగుల చేత వారి ఇంటి వద్ద నుంచే పని చేయించాలని తెలిపింది. 70 ఏళ్ళ వయసు పైబడినవారికి అవసరమైన మందులను వారి ఇంటి వద్దకే తీసుకెళ్ళి అందజేయాలని నిర్ణయించింది. 


Updated Date - 2021-04-21T22:31:00+05:30 IST