Abn logo
Apr 17 2021 @ 00:38AM

‘పర్చూరు’లో పెరుగుతున్న కరోనా మరణాలు

గుట్టుచప్పుడు కాకుండా కొందరు ఇంటి వద్దే చికిత్స 

ఆందోళనలో ప్రజలు


పర్చూరు, ఏప్రిల్‌ 16 : మండలంలో చాపకింద నీరులా క రోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం, మ రో పక్క వ్యాక్సిన్‌ కొరత వేధిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరో పక్క మండలంలో గడిచిన ఐదు రోజుల్లో నే ముగ్గురు వ్యక్తులు కరోనా బారినపడి మృతి చెందటం ప్ర జలను మరింత కలవరానికి గురిచేస్తోంది. అందులో తిమ్మరాజుపాలెం, వీరన్నపాలెం, బోడవాడ గ్రామాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు సమాచారం. గ్రామాల్లో కరోనా బా ధితుల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల వీధుల్లో కనీసం శానిటేషన్‌ చర్యలు చేపడుతున్న దాఖలాలు కూడా కనిపించటం లేదు. దీనికి తోడు వ్యవసాయ ప నులు ముమ్మరంగా సాగుతుండటంతో ఆటోలు, ట్రాక్టర్లలో గుంపులు గుంపులు గా కూలీలు తరలిపోతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement