Abn logo
Aug 7 2020 @ 06:06AM

కొవిడ్‌ నియంత్రణా చర్యలు శూన్యం

ఓఎన్జీసీపై ఆర్డీవోకు స్థానికుల ఫిర్యాదు


ఉప్పలగుప్తం, ఆగస్టు 6: ఉద్యోగులకు వైరస్‌ సోకినా ఓఎన్జీసీ సంస్థ కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని గ్రామస్థులు గురువారం ఆర్డీవో వసంతరాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ నెల2న జగ్గరాజుపేట ఓఎన్జీసీ సైట్‌ వద్ద ఆందోళన చేయగా కరోనా నియంత్రణ చర్యలు చేపడతామని ఇచ్చిన హామీని ఐ.ఎం, ఏరియా మేనేజర్లు విస్మరించారని జనసేన నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు ఆర్డీవోకు వివరించారు. ఆర్డీవో సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement