దేశంలో భారీగా పెరిగిన Covid కేసులు

ABN , First Publish Date - 2022-06-24T15:19:57+05:30 IST

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,336 కొత్త కేసులు నమోదు అవగా... 13 మరణాలు సంభవించాయి.

దేశంలో భారీగా పెరిగిన Covid కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసుల(Covid cases) సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,336 కొత్త కేసులు నమోదు అవగా... 13 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, తెలంగాణ, హర్యానాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్క ముంబైలోనే 60 శాతం కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 88,284 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 0.20 శాతంగా ఉన్నాయి. అలాగే పాజిటివిటి రేటు 4.32 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటివరకు 4,33,62,294 కేసులు, 5,24,954 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.59 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 13,029 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,49,056గా ఉంది. 

Updated Date - 2022-06-24T15:19:57+05:30 IST