జిల్లాలో ఎనిమిది కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-02-25T06:41:55+05:30 IST

జిల్లాలో బుధవారం కొత్తగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో ఎనిమిది కరోనా కేసులు

 గుంటూరు (మెడికల్‌), ఫిబ్రవరి 24: జిల్లాలో బుధవారం కొత్తగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం తాడేపల్లిలో 1, గుంటూరు నగరంలో 4, చెరుకుపల్లిలో 1, పొన్నూరులో 2 కేసులు నమోదయ్యాయి. ప్రజలు బహిరంగ ప్రాంతాల్లో మాస్కులు ఽధరించాలని, భౌతిక దూరం పాటించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ సూచించారు. 


 1795 మందికి వ్యాక్సిన్‌

 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం 90 కేంద్రాల్లో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో కొత్తగా 3,186 మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు తొలి విడతా వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 43,250కి చేరింది. ఇక జిల్లాలో 41 కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన రెండో విడత కార్యక్రమంలో 500 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. రెండో విడత వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 8,657 చేరినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ తెలిపారు. 

Updated Date - 2021-02-25T06:41:55+05:30 IST