మాస్క్ లేదా?.. ఏఐ మానిటర్ పట్టేస్తుంది... జాగ్రత్త!

ABN , First Publish Date - 2020-10-18T13:29:43+05:30 IST

కరోనా మహమ్మారి సోకకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. దీనికి ఎవరూ అతీతులు కాదు. అయితే కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే బ్రిటన్‌లో మాస్క్ లేకుండా మాల్స్ సందర్శించాలనుకునే...

మాస్క్ లేదా?.. ఏఐ మానిటర్ పట్టేస్తుంది... జాగ్రత్త!

లండన్: కరోనా మహమ్మారి సోకకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. దీనికి ఎవరూ అతీతులు కాదు. అయితే కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే బ్రిటన్‌లో మాస్క్ లేకుండా మాల్స్ సందర్శించాలనుకునే వారిని కట్టడి చేసేందుకు ‘ఏఐ మానిటర్’ రంగంలోకి దిగింది. ఏఐ మానిటర్ అనేది ఒక ప్రత్యేకమైన సీసీటీవీ కెమెరా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఐఈ) సాయంతో పనిచేస్తుంది. మాల్‌లోకి వచ్చేవారు మాస్క్ పెట్టుకున్నారా లేదా అనే దానిని ఇది గమనిస్తుంది. మాస్క్ ధరించిన వినియోగదారులు వచ్చినపుడు మాత్రమే బయటనున్న గ్రీన్ లైట్ వెలిగి, మాల్ డోర్స్ తెరుచుకుంటాయి. 


మాస్క్ ధరించనివారు వచ్చినపుడు రెడ్ లైట్ వెలగడంతో పాటు డోర్స్ తెరుచుకోవు. బ్రిటన్‌లోని అన్ని మాల్స్‌లో ఏఐ మానిటర్ల‌ను అమర్చే బాధ్యతను బ్రిటన్ ప్రభుత్వం ‘సీసీటీవీ డాట్ కో డాట్ యూకే’ అనే కంపెనీకి అప్పగించింది. దీనిపై మాల్స్ యజమానులు కొందరు స్పందిస్తూ... మాస్క్ లేకుండా వచ్చే వినియోగదారులకు అభ్యంతరం చెబితే వారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అటువంటివారిని నియంత్రించేందుకు ‘ఏఐ మానిటర్’ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ విధానం వలన సత్ఫలితాలు ఉంటాయని వారు అంటున్నారు. 

Updated Date - 2020-10-18T13:29:43+05:30 IST