కోవిడ్-19 దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ

ABN , First Publish Date - 2020-02-22T00:23:02+05:30 IST

కరోనా దెబ్బకు చైనా ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడుతోంది.

కోవిడ్-19 దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ

న్యూఢిల్లీ: కోవిడ్-19 దెబ్బకు చైనా ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడుతోంది. వైరస్‌కు భయపడిన ప్రజలు ఇళ్లను వదిలి బయకు రావడంలేదు. రహదారులన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. వస్తువుల కున్న డిమాండ్ భారీగా పతనమవడంతో అనేక రంగాల వృద్ధి రేటు తిరోగమనంలో పయనిస్తోంది. ముఖ్యంగా కార్ల క్రయవిక్రయాలపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.  తాజాగా చైనా ప్యాసింజర్స్ కార్స్ అసోసియేషన్ ఫిబ్రవరి తొలి 16 రోజుల్లో జరిగిన కార్ల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. కరోనా కారణంగా కార్ల అమ్మకాలు 92 శాతం మేర పతనమయ్యాయని తెలిపింది. గత ఏడాది ఇదే సీజన్‌లో 59,930 కార్లు అమ్ముడవగా ప్రస్తుతం ఈ సంఖ్య 4,909కి పడిపోయింది. అమ్మకాలు భారీగా పడిపోవడంతో డీలర్లు షోరూమ్‌లకు తాళాలు వేస్తున్నారు. అతి తక్కువ షోరూమ్‌లు మాత్రమే తెరిచి ఉంటున్నాయి నివేదికలో వెల్లడైంది.

ఇక భారతీయ టీవీ రంగం కూడా కోవిడ్-19 ప్రభావం పడుతోంది. భారత్‌కు దిగుమతయ్యే చైనా ఓపెన్ సేల్ టెలివిజన్ ప్యానెళ్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. భారత్‌లోని ఓపెన్ సేల్ టెలివిజన్ ప్యానళ్లలో చైనా ఉత్పత్తుల వాటా అధికం కావడంతో.. దీని ప్రభావంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాలో ప్యానళ్ల ఉత్పత్తి కుటుపడటంతో వాటి ధరలు కనీసం 20 శాతం పెరుగుతాయని..దీంతో టీవీల ధరలు కూడా 10 శాతం అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 





Updated Date - 2020-02-22T00:23:02+05:30 IST