తిరుపతిలో సంప్రదాయ కళాశాలలో కోర్సులు

ABN , First Publish Date - 2022-06-20T21:09:22+05:30 IST

సంప్రదాయ కళలను పరిరక్షించి, వారసత్వాన్ని కొనసాగించే లక్ష్యంతో తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణా సంస్థ నడుస్తోంది. 1960లో సర్టిఫికెట్‌ కోర్సులతో మొదలైన ఈ కళాశాలలో 1986 నుంచీ ఎస్‌బీటీఈటీ(స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌..

తిరుపతిలో సంప్రదాయ కళాశాలలో కోర్సులు

సంప్రదాయ కళలను పరిరక్షించి, వారసత్వాన్ని కొనసాగించే లక్ష్యంతో తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో  శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణా సంస్థ నడుస్తోంది. 1960లో సర్టిఫికెట్‌ కోర్సులతో మొదలైన ఈ కళాశాలలో 1986 నుంచీ ఎస్‌బీటీఈటీ(స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌) అనుమతితో డిప్లొమా  కోర్సులను కూడా ప్రారంభించారు. ఈ సంస్థ  వచ్చే విద్యాసంవత్సరంలో చేరదలచుకున్నవారి కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దరఖాస్తులకు చివరి తేదీ జూలై 10.  

వెబ్‌సైట్‌: www.tirumala.org


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై 20ఏళ్లలోపు వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. సంప్రదాయ కుటుంబానికి చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో రెండేళ్లు మినహాయింపు ఇస్తారు. 

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 100మార్కులకు ఉంటుంది. పదవతరగతికి సంబంధించిన తెలుగు, గణితం, సాంఘికశాస్రాల నుంచి 50 మార్కులు; డ్రాయింగ్‌లో 50మార్కుల చొప్పున   ప్రశ్నలు అడుగుతారు. ఏపీ ప్రభుత్వ రిజర్వేషన్‌ ప్రకారం సీట్ల కేటాయింపు చేస్తారు. 

అభ్యర్థుల పేరిట రూ.లక్ష నగదు డిపాజిట్‌: నాలుగేళ్ల కాలవ్యవధితో నిర్వహించే డిప్లొమాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఒక్కొక్కరి పేరుమీద టీటీడీ రూ.లక్ష నగదును జాతీయబ్యాంకులో డిపాజిట్‌ చేస్తుంది. ఈ కోర్సు ఉత్తీర్ణులైన తరవాత వీరికి రూ.లక్షతోపాటుగా దానిపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని కలపి విద్యార్థి పేరుపై డీడీ ఇస్తారు. 

ఉచిత భోజన, వసతి: ఈ కళాశాలలో డిప్లొమాలో చేరిన వారికి విద్యతోపాటు ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తారు. అలాగే మూడు శిల్పశాస్త్ర గ్రంథాలను ఉచితంగా ఇవ్వడంతోపాటు నాలుగో సంవత్సరం చదివే విద్యార్థులను దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చారిత్రక ఆలయాల సందర్శనకు ఉచితంగా పంపుతారు. 

ఉన్నతవిద్యకు అవకాశం: డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు తదుపరి బ్యాచిలర్‌ ఆఫ్‌ పైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ), మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(ఎంఎఫ్‌ఏ)లాంటి ఉన్నతవిద్యను అభ్యసించవచ్చు. ఈ కోర్సులను కడపలోని ప్రభుత్వ పైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ పైన్‌ ఆర్ట్స్‌(జేఎన్‌ఏఎఫ్‌ఏ), తెలుగు వర్సిటీ  ఆఫర్‌ చేస్తున్నాయి.

చిరునామా: శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణా సంస్థ తిరుపతిలో అలిపిరి రోడ్డులో ఉంది. ఆఫీసు ఫోన్‌నెంబరు 0877-2264637,

వెబ్‌సైట్‌: svitsattd@yahoo.in  


ఆలయనిర్మాణం(టెంపుల్‌ ఆర్కిటెక్చర్‌)

కోర్సు: డిప్లొమా 

వ్యవధి: నాలుగేళ్లు

సీట్లు: 10

హాస్టల్‌వసతి: ఉచితం

ఫీజులు: ఎలాంటి ఫీజులేదు

టీటీడీ డిపాజిట్‌: ఒక్కో విద్యార్థికి రూ.లక్ష


సుధాశిల్పం(సుధా స్కల్ప్‌చర్‌)

కోర్సు: డిప్లొమా 

వ్యవధి:  నాలుగేళ్లు

సీట్లు : 10సీట్లు

హాస్టల్‌వసతి: ఉచితం

ఫీజులు : ఎలాంటి ఫీజులేదు

టీటీడీ డిపాజిట్‌: ఒక్కో విద్యార్థికి రూ.లక్ష


కలంకారి కళ

కోర్సు: సర్టిఫికెట్‌

వ్యవధి:  రెండేళ్లు

హాస్టల్‌వసతి: ఉచితం

సీట్లు: 10సీట్లు ఫీజులు: ఎలాంటి ఫీజులేదు

టీటీడీ డిపాజిట్‌: వీరికి నగదు డిపాజిట్‌ ఉండదు.


సంప్రదాయ వర్ణచిత్రలేఖనం (ట్రెడిషనల్‌ పెయింటింగ్‌)

కోర్సు : డిప్లొమా 

కోర్సుకాలం: నాలుగేళ్లు

సీట్లు: 10సీట్లు

హాస్టల్‌వసతి: ఉచితం

ఫీజులు: ఎలాంటి ఫీజులేదు

టీటీడీ డిపాజిట్‌: ఒక్కో విద్యార్థికి రూ.లక్ష


శిలాశిల్పం  

(స్టోన్‌ స్కల్ప్‌చర్‌)

కోర్సు: డిప్లొమా 

వ్యవధి:  నాలుగేళ్లు

సీట్లు : 10సీట్లు

హాస్టల్‌వసతి: ఉచితం

ఫీజులు: ఎలాంటి ఫీజులేదు

టీటీడీ డిపాజిట్‌: ఒక్కో విద్యార్థికి రూ.లక్ష


లోహశిల్పం (మెటల్‌ స్కల్ప్‌చర్‌)

కోర్సు: డిప్లొమా 

కోర్సుకాలం: నాలుగేళ్లు

సీట్లు : 10సీట్లు

హాస్టల్‌వసతి: ఉచితం

ఫీజులు : ఎలాంటి ఫీజులేదు

టీటీడీ డిపాజిట్‌: ఒక్కో విద్యార్థికి రూ.లక్ష


దారుశిల్పం (వుడ్‌ స్కల్ప్‌చర్‌)

కోర్సు: డిప్లొమా 

వ్యవధి:  నాలుగేళ్లు

సీట్లు: 10సీట్లు

హాస్టల్‌వసతి: ఉచితం

ఫీజులు: ఎలాంటి ఫీజులేదు

టీటీడీ డిపాజిట్‌: ఒక్కో విద్యార్థికి రూ.లక్ష


అధిక ఉపాధి అవకాశాలు 

డిప్లొమా చదివిన వారికి ఏపీప్రభుత్వ దేవాదాయ ధర్మదాయశాఖలో, పురావస్తుశాఖలో, టీటీడీ ఇంజినీరింగ్‌ విభాగంలో, ఎస్వీ శిల్పకళాశాలలో స్థపతులుగా, అధ్యాపకులుగా, డ్రాయింగ్‌ మాస్టర్లుగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. శిలాశిల్పవిభాగం చదివిన వారికి టీటీడీలో ఎస్వీ ప్రొడక్షన్‌ కేంద్రంలో కాంట్రాక్ట్‌ శిల్పులుగా అవకాశం కల్పిస్తారు. అలాగే ఆలయాల నిర్మాణాలు, ఆలయ జీర్ణోర్ధరణ, దేవతాశిల్పాలు తయారు చేసి స్వయం ఉపాధి కూడా పొందవచ్చు. కలంకారి కళను చదివిన వారు స్వయం ఉపాధిని పొందవచ్చు. దేశవిదేశాల్లో ఈకళకు మంచి ఆదరణ ఉంది.  

- కూసం వెంకటరెడ్డి, ప్రిన్సిపాల్‌

Updated Date - 2022-06-20T21:09:22+05:30 IST