రాయ్‌పూర్(చత్తీస్ఘడ్): ఓ వివాహ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది.చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్ నగరానికి చెందిన ఓ జంట పెళ్లి వేడుకలో ఊయల విరిగిపోవడంతో కిందపడి గాయపడ్డారు.పెళ్లిళ్ల సీజన్ లో జంటలు తమ వేడుకను ఘనంగా నిర్వహించుకోవడానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈవెంట్ ప్లానర్లు వధూవరుల ప్రవేశం ఊయల ఊగుతూ ఉండాలని నిర్ణయించారు.రాయ్‌పూర్‌కు చెందిన ఒక జంట ఊయల ఊగుతూ అతిథుల ముందుకు వస్తున్నపుడు ఒక్కసారిగా ఊయల విరిగిపడి వధూవరులిద్దరూ గాయపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో వేదిక చుట్టూ బాణసంచా కాలుస్తుండగా నృత్యకారులతో ఓవల్ ఆకారంలో ఉన్న ఊయల మీద వధూవరులు ప్రత్యక్షమయ్యారు.ఊయల విరిగిపడటంతో వధూవరులిద్దరూ కిందపడటంతో అతిథులు పరుగెత్తి వారిని పట్టుకున్నారు. ఈ దుర్ఘటనలో వధూవరులిద్దరూ గాయపడ్డారు.