Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిండా ముంచిన నకిలీ బయోమందులు

ఎండిపోయిన పది ఎకరాల శనగ పంట

ఆదిలాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రైతులను నకిలీ బయోమందులు నిండా ముంచుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం తో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రైతులకు బయోమందులను అంటగడుతున్నా రు. శనివారం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం కచికంటి గ్రామానికి చెందిన కుర్ర దత్తాత్రేయ అనే రైతు తనకున్న పది ఎకరాల పంట భూమిలో శనగ పంటను వేశాడు. చీడపీడలు ఆశించడంతో బయోమందును పిచికారి చేశాడు. దీంతో 24గంటల్లోనే పంట వాడుముఖం పట్టి ఎండిపోయిందని బాధిత రైతు వాపోయాడు. దీంతో అఖిల భారత కృషి సంఘం జిల్లా కార్యదర్శి చిల్కదేవిదాస్‌ పంట పొలాన్ని పరిశీలించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. వ్యాపారులతో వ్యవసాయ శాఖాధికారులు కుమ్మక్కు కావడంతోనే రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. వ్యాపారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Advertisement
Advertisement