తల్లిని పట్టించుకోని కుమారులకు కౌన్సిలింగ్‌

ABN , First Publish Date - 2022-05-18T06:27:46+05:30 IST

మండలంలోని వట్టిమర్తిలో తల్లిని పట్టించుకోకుండా ఒంటరి చేసిన కు మారులకు ఎల్డర్‌ లైన ఫీల్డ్‌ రెస్పాన్స సంస్థ అధికారులు మంగళవా రం కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

తల్లిని పట్టించుకోని కుమారులకు కౌన్సిలింగ్‌
వట్టిమర్తిలో నర్సమ్మను కుమారుల ఇంటికి చేర్చిన అధికారులు

 కుమారుల ఇంటికి చేర్చిన ఎల్డర్‌ లైన సంస్థ

చిట్యాలరూరల్‌, మే 17: మండలంలోని వట్టిమర్తిలో తల్లిని పట్టించుకోకుండా ఒంటరి చేసిన కు మారులకు ఎల్డర్‌ లైన ఫీల్డ్‌ రెస్పాన్స సంస్థ అధికారులు మంగళవా రం కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తల్లిని ఇం టికి పంపారు. మండలంలోని వట్టిమర్తికి చెందిన నూనె నర్సమ్మ అనే వృద్ధురాలికి నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు చేసింది. వృద్ధురాలైన నర్సమ్మ పోషణ బాధ్యతలు కుమారులు చూసుకోవాలని గ్రామస్థులు సూచించగా అందుకు ఒప్పుకున్న కు మారులు ఈ నెల 16న చిట్యాల పోలీ్‌సస్టేషనలో ఒప్పంద పత్రం రాసిచ్చారు. తల్లిని గ్రామానికి తీసుకెళ్లి పాతబడిన రేకుల షెడ్డులో ఒంటరిగా వదిలేశారు. వృద్ధురాలిని చూసిన వారు 14567 నంబరుకు ఫోన చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఎల్డర్‌ లైన ఫీల్డ్‌ రెస్పాన్స సంస్థ అధికారులు, పోలీసులు, అంగనవాడీ అధికారులు మంగళవారం గ్రామానికి చేరుకున్నారు. సంస్థ అధికారి నాగిరెడ్డి నర్సమ్మ గురించి వాకబు చేశారు. రేకుల షెడ్డులో ఉందని తెలుసుకొని గ్రామపెద్దలు, గ్రామస్థులతో మాట్లాడారు. నర్సమ్మ కుమారులు, కోడళ్లను పిలిపించి మాట్లాడారు. తల్లిని భారమనుకోవద్దని చేరదీయాలని కౌన్సిలింగ్‌ ఇచ్చారు. నర్సమ్మను కుమారుల ఇంటికి చేర్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మోహనరెడ్డి, గోపాల్‌, వెంకటాచారి, వేణుగోపాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-18T06:27:46+05:30 IST