మూణ్ణెల్లకోసారి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలు?

ABN , First Publish Date - 2022-05-27T04:54:07+05:30 IST

ప్రతి నెలా నిర్వహించాల్సి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలను మూడు నాలు గు నెలలకోసారి నిర్వహించడం పద్ధతి కాదని టీడీ పీ కౌన్సిలర్‌ బీఎన నాగేశ్వరి ధ్వజమెత్తారు.

మూణ్ణెల్లకోసారి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలు?
సమావేశంలో ప్రశ్నిస్తున్న కౌన్పిలర్‌ సుబ్బారెడ్డి

మైదుకూరు, మే 26 :  ప్రతి నెలా నిర్వహించాల్సి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలను మూడు నాలు గు నెలలకోసారి నిర్వహించడం పద్ధతి కాదని టీడీ పీ కౌన్సిలర్‌ బీఎన నాగేశ్వరి ధ్వజమెత్తారు.  స్థానిక స్త్ర్తీశక్తి భవన్‌లో గురువారం మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 23 అంశా లతో కూడిన ఎజెండాను  సభ్యుల ఆమోదం కోసం ఉంచారు. అందులో  డ్రైనేజీ, తాగునీరు, రో డ్ల ఏ ర్పాటు పనులు ఉండడంతో  ప్రతిపక్ష సభ్యు లు ఆమోదం తెలిపారు.  పారిశుధ్య కార్మికులను  కాం ట్రాక్టు పద్ధతిలో కాకుండా నేరుగా చేర్చుకునేందు కు అవకాశం ఇవ్వాలని టీడీపీ కౌన్సిలర్‌ రాధ  కోరగా, శాసనసభ్యుడు రఘురామిరెడ్డి జోక్యం చే సుకొని,  నేరుగా ఇచ్చేందుకు జీవో లేదని, రాష్ట్రం లోని ఏ మున్సిపాలిటీ అయినా అలా అమలు చేస్తే మనం కూడా అమలు చేద్దామని సమాధానమి చ్చారు. కాగా మున్సిపల్‌ ఛైర్మన్‌, కమినరు గదుల్లో 1.13 లక్షలతో ఏసీ ఏర్పాటు, 1,24,700తో ఫొటో స్టాట్‌ యంత్రం,  కమిషనరుకు కేటాయించిన వా హనానికి నెలకు రూ. 35 వేలతో బాడుగ చెల్లింపు,  సోడియం స్ర్పేయింగ్‌కు నెలకు 90 వేల అద్దెతో ట్రాక్టరు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.  సచివాల యాల్లో స్టేషనరీకి రూ 1.32 లక్షలు సాధారణ నిధుల నుండి  చెల్లించేందుకు అమోదించారు. 

Updated Date - 2022-05-27T04:54:07+05:30 IST