పత్తి విత్తన కంపెనీలే రైతులతో ఒప్పందాలు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-22T04:54:52+05:30 IST

పత్తి విత్తన కంపెనీలు రైతులతో ఒప్పం దాలు చేసుకొని సాగు చేయించుకోవాలని, మధ్యవర్తులు (సీడ్‌ అర్గనైజర్ల)గా వ్యవహరిస్తున్న వారు రైతులను నిలువునా ముంచుతున్నారని నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్‌ కుమార్‌ అన్నారు. పత్తి విత్తన కంపెనీలు రైతులతో ఒప్పం దాలు చేసుకొని సాగు చేయించుకోవాలని, మధ్యవర్తులు (సీడ్‌ అర్గనైజర్ల)గా వ్యవహరిస్తున్న వారు రైతులను నిలువునా ముంచుతున్నారని నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్‌ కుమార్‌ అన్నారు.

పత్తి విత్తన కంపెనీలే రైతులతో ఒప్పందాలు చేసుకోవాలి
కలెక్టరేట్‌ ముందు ఆందోళన చేస్తున్న నడిగడ్డ రైతుల హక్కుల పోరాట సమితి నాయకులు

- నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి నాయకులు 

- సీడ్‌ పత్తి రైతులకు మద్దతుగా కలెక్టరేట్‌ ముందు ధర్నా


గద్వాల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : పత్తి విత్తన కంపెనీలు రైతులతో ఒప్పం దాలు చేసుకొని సాగు చేయించుకోవాలని, మధ్యవర్తులు (సీడ్‌ అర్గనైజర్ల)గా వ్యవహరిస్తున్న వారు రైతులను నిలువునా ముంచుతున్నారని నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్‌ కుమార్‌ అన్నారు. సోమవారం నడిగడ్డ రైతుహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. కలెక్టర్‌ రావాలని పట్టుబట్టడంతో ఉద్రికత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చివరకు కలెక్టర్‌ శ్రుతి ఓఝా బయటకు వచ్చి వారితో మాట్లాడి ఐదుగురు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. ముందుగా నాయకుల నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ వచ్చారు. కలెక్టరే రావాలని డిమాండ్‌తో వెనుదిరిగారు. అనంతరం అదనపు కలెక్టర్‌ రఘురాం శర్మ వచ్చారు. ఆయనకు ఫిర్యాదు ఇవ్వడానికి నాయకులు అంగీకరిం చలేదు. చివరకు కలెక్టరేట్‌ లోపలికి చొచ్చుకునే ప్రయత్నాలు చేశారు. ఈ ఘట నను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్‌ వారి నుంచి ఫిర్యాదును స్వీకరించారు. 15 రోజుల్లో మీ ఫిర్యాదుకు సమాధానం చెపుతానని చెప్పారు. అనంతరం రంజిత్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సీడ్‌ అర్గనైజర్లు రైతులపై వడ్డీలు వేస్తున్నారని అన్నారు. కంపెనీల నుంచి రైతులకు డబ్బులు వచ్చినా వారికి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, సీడ్‌ అర్గనైజర్లు విత్తన కంపెనీల వద్ద కమీషన్లు తీసుకుంటున్నారని, రైతుల వద్ద వడ్డీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మధ్యవర్తుల వల్ల రైతులు అనేక రకాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంలో మానవహక్కు ల కమిషన్‌కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పత్తి రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు. అఽధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. రైతులతోపాటు బుచ్చిబాబు, లవన్న ఉన్నారు.



Updated Date - 2021-06-22T04:54:52+05:30 IST