న్యూఢిల్లీ: భారత రైల్వే శాఖ ఇటీవల కాలంలో కొన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టికెట్ల ధరలను పెంచింది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగకుండా ఉండేందుకే కొన్ని రైల్వేస్టేషన్లలో తాత్కాలికంగా ప్లాట్‌ఫారమ్ టికెట్ల ధరలను పెంచినట్లు రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకే ప్లాట్‌ఫారమ్ టికెట్ల ధరలను తాత్కాలికంగా పెంచామని రైల్వేశాఖ పేర్కొంది. మరోవైపు కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.