కరోనాతో దీర్ఘకాలిక అంగస్తంభన సమస్యలు!

ABN , First Publish Date - 2020-12-07T02:29:56+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. విస్తుగొలిపే

కరోనాతో దీర్ఘకాలిక అంగస్తంభన సమస్యలు!

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. విస్తుగొలిపే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వైరస్ సోకి, దాని నుంచి బయటడిన వారికి దీర్ఘకాలిక కాలిక సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు కరోనా చికిత్స మెరుగైంది. వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


అయినప్పటికీ వైరస్ సంబంధిత సమస్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ డేనా గ్రేసన్ ఇటీవల ఇందుకు సంబంధించి ఓ హెచ్చరిక కూడా జారీ చేశారు. టీకా వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరై కాడిపడేయొద్దని సూచించారు. 


‘‘కరోనా వైరస్ రక్తనాళ వ్యవస్థలో సమస్యలకు కారణమవుతుందని మాకు తెలుసు. ఫలితంగా పురుషుల్లో దీర్ఘకాలిక అంగస్తంభన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం. వైరస్ మనల్ని చంపడమే కాదు, వాస్తవానికి దీర్ఘకాలిక, జీవితకాల, సంభావ్య, సమస్యలకు కారణమవుతుంది’’ అని గ్రేసన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున  కోలుకుంటున్నట్టు కనిపిస్తున్నప్పటికీ వైరస్ కారణంగా నాడీ సమస్యలు సహా దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు సంభవించే అవకాశం ఉందని గ్రేసన్ హెచ్చరించారు.

Updated Date - 2020-12-07T02:29:56+05:30 IST