యూపీ త‌రువాత శ్రీన‌గ‌ర్‌, పూణె, మ‌ధురై, షిల్లాంగ్‌, బెంగ‌ళూరులో లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2020-07-13T15:40:09+05:30 IST

పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు ప‌లు రాష్ట్రాలు, నగరాల్లో మరోసారి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రతి శనివారం, ఆదివారం లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించగా....

యూపీ త‌రువాత శ్రీన‌గ‌ర్‌, పూణె, మ‌ధురై, షిల్లాంగ్‌, బెంగ‌ళూరులో లాక్‌డౌన్‌!

న్యూఢిల్లీ: పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు ప‌లు రాష్ట్రాలు, నగరాల్లో మరోసారి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రతి శనివారం, ఆదివారం లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించగా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీనగర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఈ రోజు నుంచి తిరిగి లాక్‌డౌన్ విధించారు. ఇదేవిధంగా జూలై 23 వ‌ర‌కూ మహారాష్ట్రలోని పూణేలో లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణయించారు. తమిళనాడులోని మధురైలో లాక్‌డౌన్‌ మరో రెండు రోజులు పొడిగించారు. నేటితో ఇక్కడ లాక్‌డౌన్ ముగియ‌నుండ‌గా, దీనిని జూలై 14 వ‌ర‌కూ పొడిగించారు. నేడు, రేపు షిల్లాంగ్‌లో లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ రోజు నుంచి జమ్ముకశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేశారు. మహారాష్ట్రలో కరోనా సంక్షోభం మ‌రింత తీవ్రతరం అవుతోంది. ముంబైతో పాటు పూణేలో రోగుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. పూణేలో ఈ రోజు నుంచి జూలై 23 వరకు లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్నారు. కర్ణాటక రాజ‌ధాని బెంగ‌ళూరులో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బెంగ‌ళూరులో జూలై 14 రాత్రి 8 గంటల నుండి జూలై 22 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో అధికారులు ప్ర‌జ‌ల‌కు అవసరమైన సేవలను అందుబాటులో ఉంచ‌నున్నారు. 

Updated Date - 2020-07-13T15:40:09+05:30 IST