ఢిల్లీలో తగ్గిన కరోనా కేసులు...
ABN , First Publish Date - 2021-05-24T12:49:55+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది....
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మార్చి 30 వతేదీ తర్వాత ఢిల్లీలో 1649 కరోనా కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఆదివారం కరోనాతో 189 మంది మరణించారు. ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగించడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.42 శాతం తగ్గింది. వరుసగా రెండో రోజు కరోనా మరణాల సంఖ్య 200కంటే తగ్గింది. ఏప్రిల్ 1వతేదీన ఢిల్లీలో 2,790 కరోనా కేసులు నమోదైనాయి. శనివారం ఢిల్లీలో 2,260 కరోనా కేసులు నమోదైనాయి. శుక్రవారం 3,009 కేసులు, గురువారం 3,231, బుధవారం 3,846 కరోనా కేసులు వెలుగుచూశాయి. గత వారం కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ ఆదివారం 1649కి చేరాయి. దీంతో ఢిల్లీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.