కరోనా వల్ల మరణించే యువకుల సంఖ్య పెరుగుతోంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ABN , First Publish Date - 2020-04-04T22:23:17+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్.. యువత ప్రాణాలను కూడా బలితీసుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ఇంతకాలం ఈ వైరస్ వల్ల వృద్ధులే మరణిస్తారని, వయసులో ఉన్నవారికి వైరస్ సోకినా కోలుకుంటారని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని, రోజులు గడిచేకొద్దీ ఈ వైరస్ సోకి ఐసీయూలో చేరుతున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది తెలుస్తోంది.

కరోనా వల్ల మరణించే యువకుల సంఖ్య పెరుగుతోంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ

వాషింగ్టన్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్.. యువత ప్రాణాలను కూడా బలితీసుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ఇంతకాలం ఈ వైరస్ వల్ల వృద్ధులే మరణిస్తారని, వయసులో ఉన్నవారికి వైరస్ సోకినా కోలుకుంటారని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని, రోజులు గడిచేకొద్దీ ఈ వైరస్ సోకి ఐసీయూలో చేరుతున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్ధకు చెందిన మరియా కేర్ఖోవే శనివారం వెల్లడించారు. కరోనా వల్ల వృద్ధులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని, కానీ ఇటీవలి కాలంలో వైరస్ యువతరాన్ని కూడా బలిగొంటోందని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-04-04T22:23:17+05:30 IST