వైద్యులనూ వదలని వైరస్‌.. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు సోకుతున్న కరోనా

ABN , First Publish Date - 2020-07-02T22:37:42+05:30 IST

వైద్యుల దినోత్సవం రోజే డాక్టర్‌లకు, సిబ్బందికి కరోనా వైర స్‌ సోకడం బాధాకరం. కరోనా వైరస్‌ చివరకు వైద్యులను కూడా వదలడం లేదు. పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటూ రోగులకు వైద్యసే వలు అందిస్తున్న వైద్యులు

వైద్యులనూ వదలని వైరస్‌.. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు సోకుతున్న కరోనా

బాన్సువాడ పిల్లల వైద్యుడికి పాజిటివ్‌ నిర్ధారణ

కామారెడ్డిలో ముగ్గురు వైద్య సిబ్బందికి వైరస్‌

ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

వైద్యం అందించే వారికే వైరస్‌ సోకడంపై సర్వత్రా ఆందోళన

ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడుతున్న ప్రజానీకం

జిల్లాలో 59 కరోనా కేసులు నమోదు


కామారెడ్డి (ఆంధ్రజ్యోతి): వైద్యుల దినోత్సవం రోజే డాక్టర్‌లకు, సిబ్బందికి కరోనా వైర స్‌ సోకడం బాధాకరం. కరోనా వైరస్‌ చివరకు వైద్యులను కూడా వదలడం లేదు. పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటూ రోగులకు వైద్యసే వలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది కరోనా భారిన పడుతుండడంపై మరింత ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైద్యులకు సోకినట్లు ఒక కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా బుధవారం నాడు ఒక వైద్యునితో పాటు ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం వైద్యరంగంలోనే అందరిని భయాం దోళనకు గురి చేస్తోంది. బాన్సువాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి పిల్లల వైద్యుడికి కరోనా నిర్ధారణ కాగా కామారెడ్డి పట్టణంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేసే ముగ్గురి సిబ్బందికి వైరస్‌ సోకినట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నాలుగు కేసులతో కలుపుకొని జిల్లాలో ఇప్పటి వరకు 59 కరోనా కేసులు నమోదయ్యాయి.


వైద్యరంగంలో కలకలం

జిల్లాలో బాన్సువాడ, పట్టణాలలో వైద్యులు, ఇద్దరి సిబ్బందికి వైరస్‌ సోకడంతో వైద్యరంగంలోనే కరోనా కలకలం రేపుతోంది. వైద్యులు, సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందడంతో మిగితా వైద్యుల్లో ఆందోళన 

నెలకొంటుంది. బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నడుపుతున్న పిల్లల వైద్యునికి కరోనా లక్షణాలు ఉండడంతో బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. సదరు వైద్యునికి అక్కడి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదేవిధంగా కామారెడ్డి పట్టణంలోని గోదాం రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరి వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే గతంలో పట్టణంలోని ఓ స్కానింగ్‌ నిర్వాహకునికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఇతని వద్ద సిటీ స్కానింగ్‌ కోసం వచ్చిన రోగులకు ఆసుపత్రి సిబ్బందికి సోకినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరి రక్త నమూనాలను ప్రైమరీ కాంటాక్ట్‌ కింద సేకరించి పరీక్షల నిమిత్తం పంపగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులోని మరో ప్రైవేట్‌ ఆసుపత్రిలో పనిచేసే మాచారెడ్డి మండలానికి చెందిన ఓ వైద్యసిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితురాలికి కరోనా ఎలా వ్యాపించిందనే దానిపై వైద్యాధికారులు వివరాలు సేకరిస్తున్నారు.


 అదేవిధంగా కామారెడ్డి పట్టణంలోని మరో ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యులు కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉండడంతో సదరు వైద్యులు ఆసుపత్రిని మూసి వేసి హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇలా జిల్లాలో చివరకు వైద్యులకు కరోనా వ్యాప్తి చెందుతుండడంతో వైద్యరంగంలోనే కాకుండా అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆందోళన నెలకొంటుంది. ఏ చిన్న పాటి వైద్య సమస్యలు ఉన్నా ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు అందించే వైద్యులకు కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ఆసుపత్రులకు వెళ్లాల ంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీర్ఘకాలిక రోగాలతో ఉండే  రోగుల ఆస్పత్రిలకు ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వైద్యు లు సైతం ఆసుపత్రులను తెరవాలా.. వద్దా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. వైరస్‌ విస్తరిస్తుండడంతో కరోనా భారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే దానికంటే ఆసుపత్రులు తెరవక పోవడమే మంచిదనే ఆలోచనలో కొందరు వైద్యులు ఉన్నట్లు తెలుస్తోంది.


జిల్లాలో 59 కేసులు నమోదు

జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. గత నెలరోజుల నుంచి ప్రతీరోజు జిల్లాలో ఒక పాజిటివ్‌ కేసు నమోదు కావడం గమనార్హం. లాక్‌డౌన్‌ సమయంలో రెండు నెల ల పాటు జిల్లా వ్యాప్తంగా 12 కేసులకు పరిమితమైన విషయం తెలిసి ందే. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఈ నెల రోజుల కాలంలోనే 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరించడం కేసులను బట్టి చూస్తే అర్థమవుతోంది. ప్రతీరోజు రెండు కంటే ఎక్కువే కేసులు నమో దవుతున్నాయి. తాజాగా మాచారెడ్డి మండలంలో ఒకరికి కరోనా పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. చిన్నపిల్లల నుంచి మొదలుకొని వైద్య సేవ లు అందించే డాక్టర్లకు, నర్సులకు సైతం కరోనా సోకడంపై భయాందో ళనలు నెలకొంటున్నాయి. భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన ఒక్కరోజు పసికందుకు పాజిటివ్‌ నిర్ధారణ కాగా తాజాగా పిల్లల వైద్యుడికి, ముగ్గురు నర్సులకు కరోనా వ్యాప్తి చెందిందంటే జిల్లా లో వైరస్‌ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు. పట్ట ణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా జిల్లాలో రోజు రోజుకూ అన్ని ప్రాంతాలలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.


74 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ

జిల్లాకు సంబంధించిన 78 మంది అనుమానిత లక్షణాలు ఉన్న రక్త నమునాల ఫలితాలు బుధవారం వచ్చాయి. ఇందులో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మిగతా 74 మందికి నెగిటివ్‌ రిపోర్టులుగా వచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన నలుగురు సైతం వైద్యరంగంలో పనిచేసే వారే ఉన్నారు.  జిల్లాలో మొత్తం 59 కేసులకు చేరాయి. ఇందులో 7 గురు మైగ్రెంట్‌ కింద ఉన్నారు. ప్రస్తుతం 42 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 17 మంది ఆయా ఆసుపత్రుల్లో కరోనాపై చికిత్స పొందుతూ నయం కావడంతో డిశ్చార్జి అయ్యారు. బుధవారం మరో 11 రక్త నమూనాలను వైద్యాధికా రులు పరీక్షలు నిమిత్తం పంపారు. వీటితో కలుపుకొని జిల్లాకు సంబం ధించిన 20 శాంపిల్స్‌ పరీక్ష ఫలితాలు రావాల్సి ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. జిల్లాలో వైరస్‌ విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరోనా భారిన పడకుండా జాగ్త్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-07-02T22:37:42+05:30 IST