ట్రాక్టర్ల తయారీ సంస్థ టఫె తీసుకున్న నిర్ణయం ఇదే

ABN , First Publish Date - 2020-04-05T14:15:43+05:30 IST

ట్రాక్టర్ల తయారీ సంస్థ టఫె తీసుకున్న నిర్ణయం ఇదే

ట్రాక్టర్ల తయారీ సంస్థ టఫె తీసుకున్న నిర్ణయం ఇదే

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావంతో దేశమంతా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రస్తుతం వరి సాగు కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్ల తయారీ సంస్థ టఫె సన్నకారు రైతు లకు అద్దె లేకుండా సాగు పనులకు ట్రాక్టర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు టఫె ఒక ప్రకటన విడుదల చేస్తూ, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఉచిత ట్రాక్టర్‌ అద్దె పథకాన్ని ప్రవేశపెట్టామని, ఏప్రిల్‌ 1 నుంచి 90 రోజులపాటు ఈ పథకం అమ లులో ఉంటుందని తెలిపారు. ఉళవన్‌ యాప్‌ ద్వారా రైతులు ఈ సేవలు పొందవ చ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2020-04-05T14:15:43+05:30 IST