‘కరోనా’ సమస్యలు నివారించే రసాయన అణువులు

ABN , First Publish Date - 2020-04-29T15:49:39+05:30 IST

కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఎదురయ్యే శ్వాసకోశ సమస్యలను నివారించగల పలు రసాయన అణువులను నోయిడాలోని శివ్‌నాడార్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

‘కరోనా’ సమస్యలు నివారించే రసాయన అణువులు

కనుగొన్న శివ్‌నాడార్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28 : కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఎదురయ్యే శ్వాసకోశ సమస్యలను నివారించగల పలు రసాయన అణువులను నోయిడాలోని శివ్‌నాడార్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రసాయనశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ సుబబ్రత సేన్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈవిషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ ఏడాది చివరికల్లా జంతువులపై ప్రయో గ పరీక్షలు ముగించుకొని, వచ్చే ఏడాది నుంచి మనుషులపై ప్రయోగ పరీక్షలు చేపడతామన్నారు.  

Updated Date - 2020-04-29T15:49:39+05:30 IST