తొలి టీకా వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికుడు

ABN , First Publish Date - 2021-01-16T17:22:55+05:30 IST

దేశంలో అత్యంత భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానమంత్రి...

తొలి టీకా వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికుడు

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగం చేసి, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. కోవిడ్ టీకాను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమించారని అన్నారు. కాగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 


ముందుగా మనీష్ కుమార్ అనే పారిశుద్ధ్యకార్మికునికి టీకా వేశారు. తరువాత ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కరోనా టీకా వేయించుకున్నారు. డాక్టర్ రణదీప్ గులేరియా ప్రముఖ వైద్యునిగా పేరొందారు. టీకా వేయించుకోవడం ద్వారా ఆయన టీకాపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించారు. ఈ టీకాలు వేసే ప్రక్రియ కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి  హర్షవర్థన్ సమక్షంలో జరిగింది. 

Updated Date - 2021-01-16T17:22:55+05:30 IST