ఖైదీకి కరోనా

ABN , First Publish Date - 2020-05-30T10:22:56+05:30 IST

జిల్లాలోని మరో కరోనా కేసు వెలుగు చూసింది. ఒంగోలులోని జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి వైరస్‌

ఖైదీకి కరోనా

ఒంగోలు జైలులో కలవరం

సిబ్బంది, ఖైదీలకు నేడు నిర్ధారణ  పరీక్షలు 

హనుమాయిపల్లి బాలుడికి ట్రూనాట్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ 


ఒంగోలు నగరం, మే 29 : జిల్లాలోని మరో కరోనా కేసు వెలుగు చూసింది. ఒంగోలులోని జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి వైరస్‌ ఉన్నట్లు తేలింది. శుక్రవారం నిర్వహించిన వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో ఇది నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81కు చేరింది. 


విజయవాడకు చెందిన ఓ వ్యక్తిని ఇటీవల ఒక కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. దీంతో అతడిని ఒంగోలులోని జిల్లా జైలుకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా ఆయన శ్వాబ్‌ను తీసి పరీక్షల కోసం పంపగా కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ ఖైదీని రిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అతని ద్వారా ఎవరెవరికి వైరస్‌ సోకి ఉంటుందన్న విషయమై అధికారులు దృష్టి సారించారు. ఖైదీలు, జైలు సిబ్బందికి శనివారం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.


ఇదిలా ఉండగా జిల్లాలో ట్రూనాట్‌పై చేసిన పరీక్షల్లో ఓ బాలుడికి పాజిటివ్‌ ఫలితం వచ్చిం ది. బేస్తవారపేట మండలం హనుమాయిపల్లికి చెందిన 11 సంవత్సరాల బాలుడు చెన్న్తె నుంచి ఇటీవల జిల్లాకు వచ్చాడు. అతనికి వీఆర్‌డీఎల్‌ పరీక్షలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతు న్నారు. అందులో కూడా పాజిటివ్‌గా తేలితేనే కరోనా కేసుగా పరిగణగించనున్నారు. 

Updated Date - 2020-05-30T10:22:56+05:30 IST