శ్రీవారి ఆలయ అర్చకులకు కరోనా టెన్షన్

ABN , First Publish Date - 2020-08-07T03:05:34+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో తిరుమల శ్రీవారి ఆలయ అర్చకుల్లో టెన్షన్ మొదలైంది.

శ్రీవారి ఆలయ అర్చకులకు కరోనా టెన్షన్

తిరుమల : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో తిరుమల శ్రీవారి ఆలయ అర్చకుల్లో టెన్షన్ మొదలైంది. ఇవాళ శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు (45) కరోనాతో మృతి చెందడంతో అర్చకుల్లో మరింత ఆందోళన పెరిగింది. దీంతో గోవింద నిలయంలో డాల్లర్ శేషాద్రితో శ్రీవారి ఆలయ అర్చకులు చర్చించారు. కళ్యాణోత్సవ సేవను తాత్కలికంగా నిలిపివేయాలని ఆయనకు అర్చకులు సూచించారు. వాహన బేరర్లు ద్వారా వైరస్ వ్యాపిస్తుందని అర్చకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో దర్శన సమయాలను కుదించాలని అర్చకులు సూచించారు.


రేపు అనగా శుక్రవారం నాడు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లే యోచనలో అర్చకులు ఉన్నట్లు తెలుస్తోంది. రేపట్నుంచి శ్రీవారి కళ్యాణోత్సవం సేవలో ఆన్‌లైన్ విధానం ద్వారా భక్తులు పాల్గొనేలా టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. కాగా.. ఇవాళే ఆగస్టు- 31 వరకు టికెట్ల విక్రయాలను టీటీడీ ప్రారంభించింది. అర్చకుల డిమాండ్ ఆసక్తికరంగా మారింది. ఈ డిమాండ్‌పై టీటీడీ ఏ విధంగా స్పందిస్తుందో అనేదానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-08-07T03:05:34+05:30 IST