Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ఐదూ ప్రధానం

ఆంధ్రజ్యోతి(27-10-2020)

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత దీర్ఘకాలం పాటు ఇన్‌ఫెక్షన్‌ తాలూకు ప్రభావాలు కలిగి ఉండడమే ‘లాంగ్‌ కొవిడ్‌’! అయితే మిగతా వారితో పోలిస్తే, ప్రధానంగా ఐదు కొవిడ్‌ లక్షణాలు కలిగి ఉండే వారికే లాంగ్‌ కొవిడ్‌ ప్రభావం ఉంటుందని పరిశోధనలో తేలింది. అవేంటంటే...


కొవిడ్‌ సోకిన మొదటి వారంలో తలనొప్పి, నిస్సత్తువ, రుచి, వాసన కోల్పోవడం, జ్వరం, వీడని దగ్గు... ఈ ఐదు ప్రధాన లక్షణాలు కలిగి ఉంటే, వీరు కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా లాంగ్‌ కొవిడ్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ లక్షణాలకు తోడు కొవిడ్‌ సోకినప్పుడు విరేచనాలు, వాంతులు, చర్మం మీద దద్దుర్లు కూడా ఉండే వీలుంది.


అలాగే 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళలు అంతే వయస్కులైన పురుషుల కంటే ఎక్కువగా లాంగ్‌ కొవిడ్‌కు గురవుతారని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఈ హెచ్చుతగ్గులు వయోధికుల్లో కనిపించకపోవడం గమనార్హం. అలాగే ఊబకాయులు లాంగ్‌ కొవిడ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ! 
Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...