నున్నలో కరోనా కలవరం

ABN , First Publish Date - 2021-04-21T06:10:12+05:30 IST

నున్నలో కరోనా కలవరం

నున్నలో కరోనా కలవరం

ఫ వారంలో ముగ్గురు మృతి

ఫ వైరస్‌ బారినపడ్డ మరో వంద మంది 

ఫకేసులు పెరుగుదలతో ప్రజల్లో ఆందోళన

 విజయవాడ రూరల్‌, ఏప్రిల్‌ 20 : కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌తో  నున్న ప్రజలు కలవరం చెందుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందగా, గ్రామంలో వంద మందికిపైగానే వైరస్‌ బాధితులు హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. కరోనా రెండో దశ ప్రారంభమైన తర్వాత నుంచి గ్రామంలో వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా కనిపిస్తోంది. గ్రామ శివారున ఒక కాలనీలో 90 శాతం మంది వైరస్‌ బారినపడి చికిత్స పొందుతుండగా, అదే కాలనీలో ఒకరు మృతి చెందటంతో పరిసర ప్రాంత ప్రజలలో ఆందోళన మరింత పెరిగింది.  విజయవాడ రోడ్డులోని రెండు అపార్ట్‌మెంట్‌లలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతోపాటు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.   

వ్యాధి నిరోధకశక్తిని పెంచేందుకు టీకా

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని వైద్య, ఆరోగ్యశాఖ గ్రామాల్లో టీకా వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. టీకా వేయిం చుకోవడం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతు న్నారు. వెలగనేరు పీహెచ్‌సీ పరిధిలోని విజయవాడ రూరల్‌ మండ లంలోని మూడు కేంద్రాల్లో మొదటి, రెండో విడత టీకా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు సుమారు 347 మందికి టీకా వేసినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌  మాధురీదేవి తెలిపారు. కొత్తూరు తాడేపల్లి, అంబాపురం, జక్కంపూడి ప్రజలకు కొత్తూరు తాడేపల్లిలో, పీ నైనవరం, పాతపాడు, నున్నకు చెందిన వారికి నున్న జడ్పీ హైస్కూల్‌లో, ప్రసాదంపాడు, రామవరప్పాడు ప్రజలకు ప్రసాదంపాడులో టీకా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. 

Updated Date - 2021-04-21T06:10:12+05:30 IST