‘కొవిడ్‌ నిబంధనలు పాటిస్తాం.. ఇళ్లలోనే ఉంటాం’...!

ABN , First Publish Date - 2021-05-17T17:52:57+05:30 IST

రాష్ట్రంలో కరోనా రెండవ దశ తీవ్రమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. లాక్‌డౌన్‌ సమ యంలో ప్రజలు అత్యవసర పనులకు

‘కొవిడ్‌ నిబంధనలు పాటిస్తాం.. ఇళ్లలోనే ఉంటాం’...!

ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు

చెన్నై/పెరంబూర్: రాష్ట్రంలో కరోనా రెండవ దశ తీవ్రమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. లాక్‌డౌన్‌ సమ యంలో ప్రజలు అత్యవసర పనులకు తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. కానీ, పలువురు నిబంధనలు అతిక్రమించి కాలక్షేపం కోసం రోడ్లపై తిరుగుతున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన తొలి మూడు రోజుల్లో ప్రజలను పోలీసులు హెచ్చరించకపోవడంతో వారు ఇష్టానుసారంగా రోడ్లపై బలాదూర్‌ తిరగడంతో వైద్యుల సలహాతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేసింది. రోడ్లపైకి వచ్చే వారిని పోలీసులు హెచ్చ రించడంతో పాటు వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యం లో, తంజావూరు అన్నాశిలై ప్రాంతంలో ఆదివారం సంపూర్ణ లాక్‌ డౌన్‌ అమలులో ఉన్నా, పలువురు బయట తిరగడంతో, పోలీసులు వారిని అడ్డుకొని, వరుసగా నిలబెట్టి, ‘కొవిడ్‌ నిబంధనలు పాటిస్తాం...ఇళ్లలోనే ఉంటాం... లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు బయట తిరగం’ అంటూ ప్రతిజ్ఞ చేయించి, ఇళ్లకు పంపారు.

Updated Date - 2021-05-17T17:52:57+05:30 IST