‘కత్తెరకు’ చెక్! కరోనా పునరుత్పత్తికి శాస్త్రవేత్తల బ్రేకులు!

ABN , First Publish Date - 2020-10-18T00:02:13+05:30 IST

కరోనా వ్యాపించాలంటే బాధితుడి శరీరంలో ముందుగా అవి పునరుత్పత్తి చెందాలి, తద్వారా కోటాను కోట్ల వైరస్ కణాలు పుట్టుకురావాలి. ఇందుకు కోసం ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2ప్రోఎల్ అనే ఓ ‘కత్తెర’ ఎంజైమ్‌ను కరోనా వైరస్ వినియోగిస్తుంది.

‘కత్తెరకు’ చెక్! కరోనా పునరుత్పత్తికి శాస్త్రవేత్తల బ్రేకులు!

న్యూఢిల్లీ: కరోనా వ్యాపించాలంటే బాధితుడి శరీరంలో ముందుగా అవి పునరుత్పత్తి చెందాలి, తద్వారా కోటాను కోట్ల వైరస్ కణాలు పుట్టుకురావాలి. ఇందుకు కోసం ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2ప్రోఎల్ అనే ఓ ‘కత్తెర’ ఎంజైమ్‌ను కరోనా వైరస్ వినియోగిస్తుంది. ఈ ఎంజైమ్‌ను ఉపయోగించి..రోగ నిరోధక వ్యవస్థకు చెందిన ముఖ్యమైన ప్రొటీన్లను వైరస్ ముక్కులు ముక్కలుగా కత్తిరించి వాటిని నిర్వీర్యం చేస్తుంది. అందుకే దీన్ని శాస్త్రవేత్తలు ‘కత్తెర’ ఎంజైమ్‌ అని పిలుస్తుంటారు. 


అయితే..పునరుత్పత్తికి కూడా వైరస్ ఈ ఎంజైమ్‌నే వినియోగిస్తుంటుంది. దీంతో శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనంలో ఈ ‘కత్తెరనే’ టార్గెట్ చేసుకున్నారు. దీన్ని నిర్వీర్యం చేసేందుకు కొత్త విధానాన్ని కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ కత్తెరను నిరోధించే రెండు కొత్త మాలిక్యూల్స్ వారు రూపొందించారు. దీంతో కరోనా కత్తెరకు వారు చెక్ పెట్టారు. ఈ మాలిక్యూల్స్ ఆధారంగా కరోనాకు పనిపెట్టే కొత్త మందులను అభివృద్ధి చేయొచ్చని వారు చెబుతున్నారు. 

Updated Date - 2020-10-18T00:02:13+05:30 IST