చెప్పులు, వస్త్రాలతో వస్తుందా?

ABN , First Publish Date - 2020-04-08T07:16:47+05:30 IST

లాక్‌డౌన్‌ ఉన్నా నిత్యావసరాల కోసం ఎవరో ఒకరు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. తిరిగి ఇంటికొచ్చాక అనేక సందేహాలు తలెత్తడం సహజం.

చెప్పులు, వస్త్రాలతో వస్తుందా?

ఏప్రిల్‌ 7: లాక్‌డౌన్‌ ఉన్నా నిత్యావసరాల కోసం ఎవరో ఒకరు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. తిరిగి ఇంటికొచ్చాక అనేక సందేహాలు తలెత్తడం సహజం. బయటకు వెళ్తూ వేసుకెళ్లిన వస్త్రాలు, చెప్పులు లేదా బూట్లు వల్ల కరోనా వ్యాపిస్తుందేమోననే ఆందోళన చాలామందిలో ఉంటుంది. కరోనా గురించి రోజూ ఏదో ఒక కొత్త అంశం రోజూ వెలుగుచూస్తున్న నేపథ్యంలో దేన్నీ పూర్తి కొట్టిపారేయలేని పరిస్థితి ఉంది. మనుషుల శరీరం మీదే గాక బయట వివిధ రకాల ఉపరితలాల్లో కూడా కరోనా మనగలదని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే వస్త్రాలు, చెప్పుల ద్వారా కరోనా సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా జాగ్రత్తలు తీసుకొంటే మంచిదే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొవిడ్‌ సోకినవారికి దగ్గరగా ఉన్న సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. భౌతిక దూరం పాటించడం, ఇంటికి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవడం అత్యంత ముఖ్యమైన అంశాలు. వస్త్రాల మీద కరోనా ఎక్కువసేపు ఉండలేదు. అయితే బయట నుంచి రాగానే వస్త్రాలు ఉతుక్కోవడం లేదా ఇస్త్రీ చేసుకొంటే మంచిదంటున్నారు.


ఇళ్లలో వాడే డిటర్జెంట్‌లు కూడా కరోనా సోకకుండా బాగానే పనిచేస్తాయి. ముఖ్యంగా వైద్య సిబ్బంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. చెప్పులు లేదా బూట్లు గడప బయటే వదిలేస్తాం కాబట్టి ఆందోళన అవసరం లేదు. వాటిని తాకే అవకాశం అరుదు. అయితే చెప్పులు పెట్టుకొనే చోటుకు తరచుగా వెళ్లకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. 

Updated Date - 2020-04-08T07:16:47+05:30 IST