రైల్వే ప్రయాణికులకు కరోనా ముప్పు

ABN , First Publish Date - 2020-07-10T22:27:18+05:30 IST

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రైల్వే శాఖ బెర్తుల కేటాయింపులో ప్రత్యేక పద్ధతిని విస్మరించింది. రెగ్యులర్‌ పద్ధతిలోనే కేటాయిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. కరోనా బారి నుంచి ప్రయాణికుల రక్షణకు

రైల్వే ప్రయాణికులకు కరోనా ముప్పు

రెగ్యులర్‌ పద్ధతిలోనే బెర్తుల కేటాయింపు

అంతరం పాటించని వైనం


గుంతకల్లు(అనంతపురం) : ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రైల్వే శాఖ బెర్తుల కేటాయింపులో ప్రత్యేక పద్ధతిని విస్మరించింది. రెగ్యులర్‌ పద్ధతిలోనే కేటాయిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. కరోనా బారి నుంచి ప్రయాణికుల రక్షణకు ఆర్టీసీ ఇదివరకే సీట్ల కేటాయింపులో అంతరం పాటిస్తోంది. కానీ రైల్వే లో ఈ పద్ధతిని అనుసరించడంలేదు. కరోనా కంటే ముందు ఎలాగైతే వరు స క్రమంలో అన్ని బెర్తులనూ కేటాయించిన పద్ధతిలోనే ఇస్తున్నారు. కరోనా భయంతో ప్రయాణాలకు జనం వెనుకాడుతున్న పరిస్థితుల్లో బోగీలన్నీ నిం డటంలేదు. కొన్నింటిని ఖాళీగానే పంపుతున్నారు. ఈబోగీలను ఖాళీగా పంపే పరిస్థితులున్నాసరే బెర్తుల మధ్య అంతరాన్ని పాటించకుండా ఒక కూపేలో ఎనిమిది బెర్తులను భర్తీ చేస్తున్నారు. బోగీలు ఖాళీగా ఉండటంతో ప్రయాణికులే దూరం జరిగి కావలసిన బెర్తుల్లో పడుకోవాల్సి వస్తోంది. 


ప్రస్తుతం రైల్వే శాఖ గుంతకల్లు మీదుగా రాయలసీమ, ఉద్యాన్‌, రాజధాని అప్‌ అండ్‌ డౌన్‌ పెయిర్‌ రైళ్లను పరిమిత స్టాపింగ్‌లతో నడుపుతోంది. ఈరైళ్లలో పాతపద్ధతిలోనే బెర్తులు భర్తీ చేస్తోంది. కరోనా విస్తరిస్తున్న సమయంలో బెర్తుల కే టాయింపులో రైల్వే అనుసరిస్తున్న అసంబద్ధ పద్ధతిపై ప్రయాణికులు పెదవివిరుస్తున్నారు. జనరల్‌ బోగీలనూ స్లీపర్‌గా వినియోగిస్తుండగా, బెర్తుల కే టాయింపులో దూరాన్ని పాటిస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. తొలుత ర్యాం డమ్‌ పద్ధతిలో బెర్తులను కేటాయించి, డిమాండ్‌ ఎక్కువ ఉన్న రోజుల్లో అ న్ని బెర్తులకూ టిక్కెట్లను జారీ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నా రు. ఈవిషయంగా రైల్వే అధికారులు దృష్టిసారించి టిక్కెట్లు జారీచేసే విధానాన్ని సమీక్షించాల్సిన అవసరముంది.

Updated Date - 2020-07-10T22:27:18+05:30 IST