పెళ్లికి వెళ్లి తిరిగొచ్చేటప్పుడు సడన్ గా అనారోగ్యం.. తీరా కరోనా పరీక్షలు చేస్తే..

ABN , First Publish Date - 2020-06-22T20:28:01+05:30 IST

పుల్లంపేటలోని నాగులమాను వీధిలో ఆదివారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డాక్టర్‌ సానె శేఖర్‌, తహసీల్దారు గౌరీశంకర్‌ తెలిపారు. అన్నదమ్ములిద్దరూ ఇటీవల తాడిపత్రిలో ఓ వివాహానికి హాజరయ్యారన్నారు.

పెళ్లికి వెళ్లి తిరిగొచ్చేటప్పుడు సడన్ గా అనారోగ్యం.. తీరా కరోనా పరీక్షలు చేస్తే..

అన్నదమ్ములిరువురికీ కరోనా పాజిటివ్‌ 


పుల్లంపేట (కడప): పుల్లంపేటలోని నాగులమాను వీధిలో ఆదివారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డాక్టర్‌ సానె శేఖర్‌, తహసీల్దారు గౌరీశంకర్‌ తెలిపారు. అన్నదమ్ములిద్దరూ ఇటీవల తాడిపత్రిలో ఓ వివాహానికి హాజరయ్యారన్నారు. ఇంటికి వచ్చేటప్పుడు ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆయాసం రావడంతో స్థానిక ప్రభుత్వ వైద్యాధికారిని సంప్రదించారని, ఆయన సలహా మేరకు పరీక్షలు చేయించుకోగా వారికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. దీంతో వీరిని కడప ఫాతిమా కాలేజీ క్వారన్‌టైన్‌ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. 


కరోనాతో అధికారుల గుబులు

పుల్లంపేట మండల సచివాలయంలో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారుల్లో భయం పట్టుకుంది. రెండు రోజుల క్రితం మ నం-మన పరిశుభ్రత అనే కార్యక్రమం కింద సచివాలయ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు, వలంటీర్లకు స్థానిక ఎంపీడీఓ సభాభవనంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు కరోనా సోకిన సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ కూడా హాజరై కంప్యూటర్‌ వద్ద పనిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. అతనితో సన్నిహితంగా ఉన్న మిగతా సచివాలయ సిబ్బంది కూడా భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా నాగులమాను వీధిని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి  రహదారులు మూసివేశారు.


పోరుమామిళ్లలో మరొకరికి కరోనా

పోరుమామిళ్ల మండలంలోని వాసుదేవాపురం గ్రామానికి చెందిన వారికి 9 మందికి కరో నా పాజిటివ్‌ వచ్చిన విషయం పాఠకులకు విదిత మే. ఆదివారం విడుదలైన బులిటిన్‌లో అదే కుటుంబంలో మరొకరికి కరోనా పాజిటి్‌వ్‌ వచ్చిందని టేకూరుపేట ప్రాధమిక ఆరోగ్య విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే పోరుమామిళ్లలోని అమ్మవారిశాలవీధి, శ్రీనివాసనగర్‌, కొత్త వీధిలోని 14వ వార్డుల్లో 145 మందికి కడప మొబైల్‌ వాహనం ద్వారా స్వాబ్‌ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. 


మరో నలుగురికి పాజిటివ్‌ 

వల్లూరు మండల పరిధిలోని కోట్లూరు గ్రామంలో ఈ నెల 15న ఓ కేసు నమోదైన విషయం విదితమే. అతని ప్రైమరీ కాంటాక్ట్‌ కింద అతని కుటుంబ సభ్యులకు స్వాబ్‌ టెస్టులు చేయగా ఆదివారం నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వ వైద్యురాలు లక్ష్మి తెలిపారు. అలాగే శనివారం మండల కేంద్రమైన వల్లూరులో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. వారి ప్రైమరీ కాంటాక్టు కింద ఆదివారం 11 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు ఆమె తెలిపారు. వైరస్‌ ప్రభావిత ప్రాంతాలైన 50 మందికి సోమవారం మధ్యాహ్నం స్వాబ్‌ టెస్టులు చేయనున్నామన్నారు. ఏదేమైనా కరోనా పట్ల రెండు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎస్‌ఐ రాజగోపాల్‌ తన సిబ్బందితో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2020-06-22T20:28:01+05:30 IST