కరోనా....68

ABN , First Publish Date - 2020-05-29T10:02:59+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 68కు చేరుకున్నాయి. రెండురోజుల తర్వాత గురువారం మరో మూడు కొత్త పాజిటివ్‌ ..

కరోనా....68

ఇప్పటి వరకూ 39 వేల మందికి పరీక్షలు

చెన్నై నుంచి వచ్చిన వారిలోనే పాజిటివ్‌లు అత్యధికం

మిగిలినవి అబుదాబీ, ఖతార్‌, హైదరాబాద్‌ ఇలా... 


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 28 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 68కు చేరుకున్నాయి. రెండురోజుల తర్వాత గురువారం మరో మూడు కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అవి కూడా ఇచ్ఛాపురం, కవిటి క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నవారే కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా 39,000 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇందులో ఇప్పటివరకు  68 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఐదుగురు పూర్తిగా కోలుకుని.. ఇళ్లకు వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఈనెల మొదటివారంలో ఇతర ప్రాంతాల నుంచి వలస కార్మికులు, చెన్నై నుంచి మత్స్యకారులు వేలాదిగా జిల్లాకు వచ్చారు.విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని సైతం క్వారంటైన్‌ కేంద్రాలకు పంపేశారు.


వీళ్లందరికీ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చెన్నై నుంచి వచ్చిన మత్స్యకారుల్లో 57 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అలాగే అబుదాబి 1, ఖతార్‌, హైదరాబాద్‌ 1, విజయవాడ 1, పశ్చిమ బెంగాల్‌ 2... ఇలా ఇతర రాష్ట్రాల నేపథ్యం కలిగినవారిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  వీరంతా క్వారంటైన్‌  కేంద్రాల్లో ఉన్నవారే కావడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Updated Date - 2020-05-29T10:02:59+05:30 IST