కరోనా కా కల్లోల్‌ పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2022-08-16T06:25:43+05:30 IST

ద్వారకానగర్‌లో గల పౌరగ్రథాలయంలో విశాఖ రచయితల సంఘం, రైటర్స్‌ అండ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో హిందీ అనువాద పుస్తకం కరోనా కా కల్లోల్‌ ఆవిష్కరణ సభను నిర్వహించారు.

కరోనా కా కల్లోల్‌ పుస్తకావిష్కరణ
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ ఇక్బాల్‌, ఇతర అతిథులు

సీతంపేట, ఆగస్టు 15: ద్వారకానగర్‌లో గల పౌరగ్రథాలయంలో విశాఖ రచయితల సంఘం, రైటర్స్‌ అండ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో హిందీ అనువాద పుస్తకం కరోనా కా కల్లోల్‌ ఆవిష్కరణ సభను నిర్వహించారు. మూల రచయిత అడపా రామకృష్ణ రచన హిందీలో పారనంది నిర్మల అనువదించిన పుస్తకాన్ని డాక్టర్‌ ఇక్బాల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయిత చరిత్రకు కరోనాను పరిచయం చేశారన్నారు. డాక్టర్‌ ఎస్‌.కృష్ణబాబు అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నిర్మాలాదేవి, ఆచార్య జయలక్ష్మి, డాక్టర్‌ రాజేష్‌ కుమార్‌, మేడా మస్తాన్‌ రెడ్డి, దేవరకొండ సహదేవరావు, బి.రాధరాణి, కె.శ్రీనివాసరావు, ఉప్పల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-16T06:25:43+05:30 IST